నవోదయ విద్యాలయంలో హోరాహోరీగా ఖోఖో పోటీలు

ABN , First Publish Date - 2022-09-26T04:56:39+05:30 IST

రాజంపేట మండలం నవోదయ విద్యాలయంలో దక్షిణాది రాష్ట్రాల ఫైనల్‌ ఖోఖో పోటీలు హోరాహోరీగా జరిగాయి.

నవోదయ విద్యాలయంలో హోరాహోరీగా ఖోఖో పోటీలు
బాలుర విభాగంలో విజయం సాధించిన రాయపూర్‌ జట్టు

రాజంపేట, సెప్టెంబరు 25 : రాజంపేట మండలం నవోదయ విద్యాలయంలో దక్షిణాది రాష్ట్రాల ఫైనల్‌ ఖోఖో పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ సందర్భంగా అండర్‌-19 బాలుర విభాగంలో మహబూబ్‌నగర్‌-రాయపూర్‌ జట్లు తలపడగా రాయపూర్‌ జట్టు సాధించింది. అండర్‌-19 బాలికల విభాగంలో అస్సాం-ప్రకాశం జట్లు తలపడగా ప్రకాశం జట్టు విజేతగా నిలిచింది. అండర్‌-17 బాలుర విభాగంలో రాయపూర్‌-ఈ్‌స్టగోదావరి జట్లు తలపడగా రాయపూర్‌ జట్టు విజయం సాధించింది. అండర్‌-17 బాలికల విభాగంలో ప్రకాశం-ఈస్ట్‌గోదావరి జట్లు తలపడగా ప్రకాశం జట్టు విజయం సాధించింది. అండర్‌-14 బాలుర విభాగంలో రాయపూర్‌-ప్రకాశం జట్లు తలపడగా రాయపూర్‌ జట్టు విజయం సాధించింది. అండర్‌-14 బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌-ప్రకాశం జట్లు తలపడగా మహబూబ్‌నగర్‌ జట్టు విజేతగా నిలిచింది. 

Read more