కమనీయం.. లక్ష్మీ నరసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-10-20T16:30:16+05:30 IST

కమనీయం.. లక్ష్మీ నరసింహుడి కల్యాణం

కమనీయం.. లక్ష్మీ నరసింహుడి కల్యాణం
స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

గుర్రంకొండ, సెప్టెం బరు 29:గుర్రంకొండ మం డలం తరిగొండ లో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వా రి కల్యాణోత్సవాన్ని టీటీడీ వేద పండితు లు వైభవంగా కమనీ యంగా నిర్వహించా రు. స్వామి వారి పవి త్రోత్సవాలలో భాగంగా గురువారం పవిత్రాల విసర్జన కార్యక్రమా న్ని నిర్వహించారు. అలాగే స్వామి వారి జన్మనక్షత్రమై స్వాతి నక్షత్రం రోజున కల్యాణం నిర్వహించడం అనవాయితీ. ఇందులో భాగంగా ఉదయాన్నే స్వామి వారిని మేల్కొలిపి ఆలయశుద్ధి, తోమాలసేవ, అర్చన, పంచామృ తాలతో అభిషేకాలన చేశారు. అనంతరం స్వామి వారి ఆయుధ మైన శ్రీచక్రానికి ఘనంగా చక్రసాన్నం చేశారు. ఉత్సవమూర్తులను సర్వాగంసుందరంగా అలంకరించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్య లో భక్తులు విచ్చేశారు. కార్యక్రమంలో అర్చకులు గోపాల్‌ భట్టార్‌, మణికంఠ భట్టార్‌, కృష్ణప్రసాద్‌, కృష్ణరాజ్‌, అనిల్‌, గోకుల్‌, వెంకీ, వరద, ఆలయాధికారి కృష్ణమూర్తి పాల్గొన్నారు. 


Read more