238 పరుగుల ముందంజలో కడప జట్టు

ABN , First Publish Date - 2022-09-25T05:10:33+05:30 IST

238 పరుగులతో కడప జట్టు ముందంజలో ఉండగా అనంతపురం జట్టు కుప్ప కూలింది. వివ రాల్లోకెళితే.... ఏసీఏ సీనియర్‌ మెన్‌ మల్టీడే ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ మ్యాచ్‌ల్లో భాగంగా కడప - నెల్లూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కడప జట్టు తన మొదటి ఇన్నింగ్‌లో 238 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతపురం - చిత్తూరు జట్ల మధ్య మరో మ్యాచ్‌లో అనంతపురం జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 139 పరుగులకే కుప్ప కూలింది. వివరాలిలా..

238 పరుగుల ముందంజలో కడప జట్టు

కడప (స్పోర్ట్స్‌), సెప్టెంబర్‌ 24: 238 పరుగులతో కడప జట్టు ముందంజలో ఉండగా అనంతపురం జట్టు కుప్ప కూలింది. వివ రాల్లోకెళితే.... ఏసీఏ సీనియర్‌ మెన్‌ మల్టీడే ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ మ్యాచ్‌ల్లో భాగంగా కడప - నెల్లూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కడప జట్టు తన మొదటి ఇన్నింగ్‌లో 238 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతపురం - చిత్తూరు జట్ల మధ్య మరో మ్యాచ్‌లో అనంతపురం జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 139 పరుగులకే కుప్ప కూలింది. వివరాలిలా..

వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ మైదానంలో....

నగరంలోని రిమ్స్‌ సమీప వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ మైదానంలో అనంతపురం - చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి న అనంతపురం జట్టు మొదటి ఇన్నింగ్‌ను ప్రారంభించి 44.2 ఓవర్లలో కేవలం 139 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. చిత్తూరు జట్టు బౌలింగ్‌ విభాగంలో ధరణి కుమార్‌నాయుడు (బౌలర్‌) నాలుగు వికెట్లు సాధించాడు. చిత్తూరు జట్టు తన మొదటి ఇన్నిం గ్‌ ప్రారంభించి 27.1 ఓవర్లలోనే 148 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇందులో ఇందిరారెడ్డి 51 పరుగులు చేశారు. అనంతపురం జట్టు బౌలింగ్‌ విభాగంలో శివరాజ్‌ 6 వికెట్లు తీసి అనంతపురం జట్టు పతనానికి కారకుడయ్యాడు. అనంతపురం జట్టు తన రెండో ఇన్నింగ్‌లో 13 ఓవర్లలో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. ఇందు లో ఖాదర్‌వల్లి 27 పరుగులతో నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నారు. దీంతో అనంతపురం జట్టు చిత్తూరు జట్టుపై 40 పరుగుల ఆధిక్యత సాధించింది. ఆదివారం ఆటకు రెండో రోజు.

కేఓఆర్‌ఎం మైదానంలో....

 కడప - నెల్లూరు జట్ల మధ్య జరుగుతున్న మరో మ్యాచ్‌లో తొలుత టాస్‌ నెగ్గిన కడప జట్టు బ్యాటింగ్‌ చేపట్టి 49.4 ఓవర్లలో 238 పరుగులు సాధించింది. ఇందులో వంశీకృష్ణ 121 పరుగులు సాధించాడు. నెల్లూరు బౌలింగ్‌ విభాగంలో కె.హేమసందీప్‌ ఐదు వికెట్లు పడ గొట్టాడు. తదనంతరం నెల్లూరు జట్టు తన మొదటి ఇన్నింగ్‌ ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 121 పరుగులు సాధించింది. ఇందులో పి.ధనశేఖర్‌ 57 పరుగులతో నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నాడు. ఆటకు ఆదివారం రెండవ రోజు.

Updated Date - 2022-09-25T05:10:33+05:30 IST