రాష్ట్రానికి కడప బాస్లు!
ABN , First Publish Date - 2022-11-30T03:45:37+05:30 IST
రాష్ట్ర పరిపాలనలో గతంలో ఎన్నడూలేని ఒక కొత్త విశేషం చోటు చేసుకుంది. అన్ని కీలక విభాగాలకు చెందిన

రాష్ట్ర పరిపాలనలో గతంలో ఎన్నడూలేని ఒక కొత్త విశేషం చోటు చేసుకుంది. అన్ని కీలక విభాగాలకు చెందిన అధిపతులూ కడప జిల్లాకు చెందిన వారు కావడమే ఆ విశేషం. ప్రభుత్వాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కడప జిల్లా. స్టేట్ పోలీస్ బాస్... కసిరెడ్డి రాజేంద్రనాఽథ్ రెడ్డిది కూడా అదే జిల్లా. తాజాగా... రాష్ట్ర యంత్రాంగం మొత్తానికి బాస్ అయిన చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయనది కూడా కడప జిల్లాయే! ఇక... ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సర్కారులో నంబర్ టూ సజ్జల రామకృష్ణా రెడ్డిది కూడా అదే జిల్లా! ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన వారు ఇంకా అనేక కీలక స్థానాల్లో ఉన్నప్పటికీ... నాలుగు విభాగాల బాస్లు ఒకే జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. ఇంతేకాక డీజీపీ మినహా మిగిలిన ముగ్గురిది పులివెందుల నియోజకవర్గం కావడం గమనార్హం.
Read more