-
-
Home » Andhra Pradesh » Kadapa » Jagan government is selling the free rice given by the centre-MRGS-AndhraPradesh
-
కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యాన్ని అమ్ముకుంటున్న జగన్ సర్కార్
ABN , First Publish Date - 2022-07-19T04:36:36+05:30 IST
కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇస్తున్న ఉచిత బియ్యాన్ని పేదలకు సరఫరాచేయకుండా జగన్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటోందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు ఆరోపణ చేశారు.

పేదలకు పంచేవరకు బీజేపీ పోరాటం- గొర్రె శ్రీనివాసులు
ప్రొద్దుటూరు అర్బన్, జూలై 18 : కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇస్తున్న ఉచిత బియ్యాన్ని పేదలకు సరఫరాచేయకుండా జగన్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటోందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు ఆరోపణ చేశారు. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా కాలంలో కేంద్రం 80 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యం అందజేస్తున్నదన్నారు. ఇప్పటికీ పేదల జీవితాలు కుదుటపడకపోవడంతో కేంద్రం మరికొన్ని నెలలు ఉచితంగా బియ్యం అందజేయాలని పంపితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని నాలుగు నెలలుగా పంపిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్‌లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నదన్నారు. కేంద్రం ఇచ్చిన బియ్యం కూడా అమ్ముకునే స్థాయికి జగన్ దిన దినానికి దిగజారి ప్రభుత్వం నడుపుతున్నారన్నారు. కేసులకు భయపడి ప్రతిపక్ష టీడీపీ కూడా నోరుమూసుకుందన్నారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాలుగు నెలలుగా పంచని ఉచిత బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రఘురామిరెడ్డి, మండల అధ్యక్షుడు బోరెడ్డి సుధాకర్ రెడి,్డ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గొర్రెక్రిష్ణ, సత్య ప్రకాష్ ,శరత్ కుమార్, బొమ్మాలి రాజా, దేవభూషణం, సురేష్, రామసుబ్బయ్య, మునిస్వామి పాల్గొన్నారు.