పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న జగన్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-25T05:11:56+05:30 IST

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ప్రతికా స్వేచ్ఛను హరించి వేస్తోందని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా పేర్కొ న్నారు.

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న జగన్‌ ప్రభుత్వం
మదనపల్లెలో జరిగిన నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, ప్రజాసంఘాల నాయకులు

మదనపల్లె అర్బన్‌, సెప్టెంబరు 24: రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ప్రతికా స్వేచ్ఛను హరించి వేస్తోందని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా పేర్కొ న్నారు. శనివారం పట్టణంలోని అనిబిసెంట్‌ సర్కిల్‌వద్ద ప్రజా సం ఘాలు, అఖిల పక్షం నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కలిసి మాహాన్యూస్‌ మేనేజంగ్‌ డైరెక్టర్‌ వంశీని అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను ఎక్కడా లేని విధంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరించే విధం గా అవిరళ కృషి చేస్తున్నవి  పత్రికలేనన్నారు. టీడీపీ నాయకుడు ఆర్‌జే వెంకటేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను  ప్రశ్నించిన వ్యక్తులపై, ప్రతిపక్ష నాయకులపైనా, పత్రికలపైనా, పత్రికల ను నిర్వహించే యాజమాన్యంపై రాష్ట్రప్రభుత్వం దాడులు చేయిస్తోంద న్నారు.  సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు కృష్ణప్ప, సీపీఎం, ఏఐటీయూసీ, ప్రజా సంఘాల నాయకులు తోపాటు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్‌, టీడీపీ నాయకుడు రాటకొండ మధుబాబు, జనసేన నాయకుడు జంగాల శివరాం తదితరులు పాల్గొన్నారు. 

జర్నలిస్టుల అరెస్టు దారుణం

పీలేరు, సెప్టెంబరు 24: సీనియర్‌ జర్నలిస్టు అంకబాబు, మహాన్యూస్‌ ఛానెల్‌ ఎండీ వంశీకృష్ణ, ఇతర నాయకులను ఏపీసీఐడీ పోలీసులు అరెస్టు చేయడం దారుణమని పీలేరులోని జర్నలిస్టు, పలు ప్రజాసంఘా లు మండిపడ్డాయి. ఈ మేరకు శనివారం వారు పీలేరు తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చి విచారణ రమ్మని చెప్పాల్సి ఉండగా అంకబాబును దౌర్జన్యంగా అరెస్టు చేయడం, ఆ అరెస్టును నిరసించిన వంశీకృష్ణ, చెవుల కృష్ణాంజనేయులు, తదితరులపై దురుసుగా ప్రవర్తిం చడం అమానుషమని వారు పేర్కొన్నారు. పోలీసుల వ్యవహార శైలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దారు రవికి వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో జర్నలిస్టులు మల్లెల జాకీర్‌, పఠాన్‌ జాకీర్‌, అల్తాఫ్‌, సుబ్రహ్మణ్యం, రవి రాయల్‌, తులసి, హాషిం, మస్తాన్‌, రవి, భాను, ఎంఆర్‌పీఎస్‌ నేతలు  వెంకటేశ్‌, రమణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T05:11:56+05:30 IST