చెరువులో పడి ఇంటర్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-07-19T05:08:11+05:30 IST

మండల పరిధిలోని అనంతసముద్రం పంచాయతీ పాపక్కగారిపల్లెకు చెందిన గాడి కిషోర్‌కుమార్‌రెడ్డి (17) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. సోమవారం గేదెలను మేపుకునేందుకు అన్న పిచ్చిరెడ్డితో కలిసి సమీపంలోని చెరువు కట్ట వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడ్డాడు. అన్న పిచ్చిరెడ్డి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు చెరువులోకి దూకి కిషోర్‌కుమార్‌ను వెలికితీశారు.

చెరువులో పడి ఇంటర్‌ విద్యార్థి మృతి
మృతి చెందిన కిషోర్‌కుమార్‌రెడ్డి (ఫైల్‌)

గేదెలు మేపుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు.. 

పుల్లంపేట, జూలై 18: మండల పరిధిలోని అనంతసముద్రం పంచాయతీ పాపక్కగారిపల్లెకు చెందిన గాడి కిషోర్‌కుమార్‌రెడ్డి (17) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. సోమవారం గేదెలను మేపుకునేందుకు అన్న పిచ్చిరెడ్డితో కలిసి సమీపంలోని చెరువు కట్ట వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడ్డాడు. అన్న పిచ్చిరెడ్డి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు చెరువులోకి దూకి కిషోర్‌కుమార్‌ను వెలికితీశారు. వెంటనే 108 వాహనంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు నరసింహకుమార్‌ తన సిబ్బందితో కలిసి పాపక్కగారిపల్లెకు వెళ్లి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కిషోర్‌కుమార్‌రెడ్డికి అన్నతో పాటు చెల్లెలు కూడా ఉంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో కిషోర్‌కుమార్‌రెడ్డి ఇంటర్‌ ఎంపీసీ చదువుతున్నాడు. కళాశాల బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇంతలోనే మృతి చెందడంతో తల్లి రాజమ్మ, బంధువులు బోరున విలపించారు. సంఘటనా స్థలానికి మృతుని బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున తరలివచ్చారు. మృతదేహాన్ని వైసీపీ నాయకులు ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, కొల్లం గంగిరెడ్డి, సర్పంచ్‌ ముద్దా విజయమ్మ, యూత్‌ లీడర్‌ ముద్దా రంజిత్‌కుమార్‌రెడ్డిలు సందర్శించి నివాళులర్పించారు. 

Read more