ముమ్మరంగా వాహన తనిఖీలు

ABN , First Publish Date - 2022-09-18T04:41:28+05:30 IST

కర్నూలు- చిత్తూరు 40వ జాతీయ రహదారిలోని కొండావాండ్లపల్లె బస్టాప్‌ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద శనివారం ఎస్పీ ఆదేశాల మేరకు రామాపురం ఎస్‌ఐ జయరాములు వాహనాల తనిఖీ చేశారు. వాహనాల్లో అక్రమ మద్యం, గుట్కా, అక్రమ బియ్యం, ఎర్రచందనం వంటి వాటికి డ్రైవర్లు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

ముమ్మరంగా వాహన తనిఖీలు
కొండావాండ్లపల్లె బస్టాప్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ

రామాపురం, సెప్టెంబరు 17: కర్నూలు- చిత్తూరు 40వ జాతీయ రహదారిలోని కొండావాండ్లపల్లె బస్టాప్‌ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద శనివారం ఎస్పీ ఆదేశాల మేరకు రామాపురం ఎస్‌ఐ జయరాములు వాహనాల తనిఖీ చేశారు. వాహనాల్లో అక్రమ మద్యం, గుట్కా, అక్రమ బియ్యం, ఎర్రచందనం వంటి వాటికి డ్రైవర్లు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. అంతేకాక ప్రతి ఒక్కరూ డ్రైవింగ్‌ లైసెన్సులు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ శివశంకర్‌రాజు, ఏఆర్‌ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 

Read more