ఎరువుల దుకాణాల తనిఖీ

ABN , First Publish Date - 2022-09-30T05:10:08+05:30 IST

మండలంలోని ఎరువుల దుకాణాలను కడప సహాయ సంచాలకులు సుబ్బారావు, ఏఓ ప్రసన్న తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్స్‌లను పరిశీలించారు.

ఎరువుల దుకాణాల తనిఖీ
ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తున్న అధికారులు

మైదుకూరు రూరల్‌ సెప్టెంబరు 29: మండలంలోని ఎరువుల దుకాణాలను కడప సహాయ సంచాలకులు సుబ్బారావు, ఏఓ ప్రసన్న తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్స్‌లను పరిశీలించారు. ఎరువుల బస్తాల తూకాలను చెక్‌ చేశారు. తనిఖీ చేసిన దుకా ణాల్లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు లేవని గుర్తించారు.


గోపవరంలో....

గోపవరం, సెప్టెంబరు 29: బద్వేలులోని ఫర్టి లైజరు షాపులపై విజిలెన్స్‌ అధికారులు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. వీర బ్రహ్మేంద్రస్వామి ఫర్టిలైజర్స్‌ షాపులో యూరియా ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ అ మ్ముతున్నందున కేసు నమోదు చేశారు.  విజిలెన్స్‌ అధికారులు పురుషోత్తంరాజు,  లోకేశ్వర్‌రెడ్డి, ఏఈ, బాలగంగాధర్‌రెడ్డి, వ్యవ సాయాధికారులు నాగరాజు, అరవింద నాయక్‌, పాల్గొన్నారు.

Read more