ఎరువుల దుకాణాల తనిఖీ

ABN , First Publish Date - 2022-09-30T05:08:21+05:30 IST

పీలేరులోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేశారు. కడప విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఉమామహేశ్వర్‌ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో స్థానికంగా ఉన్న శ్రీనివాస ఫర్టిలైజర్స్‌, శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్‌ దుకాణాల్లోని రికార్డుల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు.

ఎరువుల దుకాణాల తనిఖీ
పీలేరులో ఎరువుల దుకాణాల్లో రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

రూ.2.27 లక్షల రికార్డులు గల్లంతు 

అమ్మకాలు నిలుపుదల చేయాలంటూ ఆదేశం 

పీలేరు, సెప్టెంబరు 29: పీలేరులోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేశారు. కడప విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఉమామహేశ్వర్‌ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో స్థానికంగా ఉన్న శ్రీనివాస ఫర్టిలైజర్స్‌, శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్‌ దుకాణాల్లోని రికార్డుల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్‌లోని రూ.2.27 లక్షలు విలువజేసే 157 బస్తాల ఎరువులకు సంబంధించి రికార్డులు లేనందున తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వాటి అమ్మకాలు నిలుపుదల చేయాలని ఆయన దుకాణదారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణదారులు విధిగా ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు కలిగిన వాటినే విక్రయించాలన్నారు. నకిలీ ఉత్పత్తులు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రమాదేవి, ఏఈవో నజీర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది రామకృష్ణ, శ్రీనివాసులు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Read more