కోతకు గురైన భూముల పరిశీలన

ABN , First Publish Date - 2022-09-30T05:27:34+05:30 IST

సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో కోతకు గురైన సాగు భూములను గురువారం ఉద యం ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి పరిశీ లించారు.

కోతకు గురైన భూముల పరిశీలన
కోతకు గురైన భూములను పరిశీలిస్తున్న ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి

సిద్దవటం, సెప్టెంబరు 29 : సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో  కోతకు గురైన సాగు భూములను గురువారం ఉద యం ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి  పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కోతకు గురైన భూములు, నష్టంపై విచారణ చేయాలని తహసీల్దారు శంకర్‌రావుకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో తహీ సల్దారు శంకర్‌రావు, ఆర్‌ఐ మోహన్‌రాజు, సర్వేయర్‌ సుధాకర్‌ బాబు, సచివాలయం సర్వేయర్లు పవన్‌కుమార్‌, రిషి, కేశ, వీఆర్వో కేశవులు, ఆర్‌ఏ ప్రేమ్‌కిషోర్‌ పాల్గొన్నారు.


Read more