రేషన్‌ బియ్యంలో పురుగులు

ABN , First Publish Date - 2022-10-04T05:26:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం తినడానికి వీలు లేకుండా ఉన్నాయి.

రేషన్‌ బియ్యంలో పురుగులు
పురుగులు, గూళ్లు కట్టిన రేషన్‌ బియ్యం

గుర్రంకొండ, అక్టోబరు 3: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం తినడానికి వీలు లేకుండా ఉన్నాయి. పురుగులు పట్టి గూళ్లు కట్టిన రేషన్‌ బియ్యాన్ని ఇంటింటికి బియ్యం సరఫరా చేసే వాహనంలో ఇస్తున్నారు. పురుగులు ఉన్న బియ్యాన్ని ఎలా తినాలంటూ ఓ యువకుడు అధికారులను ప్రశ్నిస్తున్నాడు. మండలంలోని సరిమడుగుకు చెందిన జీవన్‌కుమార్‌ కూలీ పనుల చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ గుర్రంకొండకు వచ్చి కూలీ పనులు చేసుకుని తిరిగి స్వగ్రామానికి వెళతాడు. ఈ క్రమంలో సోమవారం గుర్రంకొండలోని ఓ ఎండీయూ వాహనంలో 35 కిలోల రేషన్‌ బియ్యాన్ని తీసుకున్నాడు. అతడికి ఇచ్చిన రేషన్‌ బియ్యం నిండా పురుగులు పట్టి, గూళ్లు కట్టి ఉన్నాయి. ఈ బియ్యం తనకు వద్దని తెలిపినా ఎండీయూ ఆపరేటర్‌ తమ వద్ద ఈ బియ్యమే ఉన్నాయని ఇవే తీసుకోవాలని చెప్పాడు. దీంతో విధిలేక ఆ బియ్యాన్నే తీసుకోవాల్సి వచ్చిందని బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి నాణ్యమైన రేషన్‌ బియ్యం పేదలకు అందేలా చూడాలని కోరుతున్నాడు. ఈ విషయమై సీఎ్‌సడీటీ వెంకటరెడ్డిని వివరణ కోరగా రేషన్‌ దుకాణాలకు నాణ్యమైన బియ్యానే సరఫరా చేస్తున్నాం. పురుగులు, గూళ్లు కట్టిన బియ్యాన్ని రేషన్‌ డీలర్‌కు తిరిగి ఇస్తే మంచి బియ్యం ఇచ్చేలా చూస్తామని తెలిపారు. 

Updated Date - 2022-10-04T05:26:51+05:30 IST