ప్రొద్దుటూరుకే గర్వకారణం ఇండ్ల, నరాల

ABN , First Publish Date - 2022-10-03T05:02:01+05:30 IST

ప్రముఖ అవధాని నరాల రా మారెడ్డి, మానసిక వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రొద్దుటూరు కే గర్వకారణమని ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిప ల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు.

ప్రొద్దుటూరుకే గర్వకారణం ఇండ్ల, నరాల
ఇండ్ల రామసుబ్బారెడ్డి, నరాల రామారెడ్డిని సత్కరిస్తున్న దృశ్యం

గౌరవ డాక్టరేట్‌ గ్రహీతలను సత్కరించిన ఐక్యవేదిక

ప్రొద్దుటూరు టౌన్‌, అక్టోబరు 2: ప్రముఖ అవధాని నరాల రా మారెడ్డి, మానసిక వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రొద్దుటూరు కే గర్వకారణమని ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిప ల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ఎస్‌వీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసిన సందర్భంగా ఆదివారం ప్రొద్దుటూరు ఐక్యవేదిక ఆఽధ్వర్యంలో బుశెట్టి కల్యాణ మండపంలో నిర్వహించిన ఘన సన్మానంలో వారు మాట్లాడుతూ నరాల రామారెడ్డి అవధా న ప్రక్రియలో సుప్రసిద్ధులని, మానసిక వైద్య నిపుణులుగా ఇండ్ల రామసుబ్బారెడ్డి ఎంతో ప్రసిద్ధి చెందారన్నారు. ఎస్‌కే యూ నివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వారిద్దరూ ప్రొద్దుటూరు ఖ్యాతిని దేశ విదేశాలకు వ్యాపింపచేశారన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మాట్లాడుతూ నరాల రామారెడ్డి తెలుగు రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో అవధానం చేశారన్నారు.

ఐక్యవేదిక కన్వీనర్‌ డాక్టర్‌ నాగదస్తగిరిరెడ్డి మాట్లాడుతూ వారిద్దరికీ ఒకే సారి ఎస్వీయూ గౌరవ డాక్టరేట్‌ను ఇవ్వ డం హర్షనీయమన్నారు. నరాల రామారెడ్డి మాట్లాడుతూ 16 ఏళ్ల వయసులో అవధాన ప్రక్రియను ప్రారంభించానని, అప్పటి నుంచి 53 ఏళ్లు అవధానం చేశానని తెలిపారు. డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కోపం, ఆందోళన, నిరాశ, నిస్పృహ, మానసిక ఒత్తిడికి వైద్యం అవసరమన్నారు. అన్నపూర్ణ వసతిగృహం, మానవత సేవా సంస్థ, అచలానంద ఆశ్రమం, మే ఐ హెల్ప్‌యూ ఫౌండేషన్‌, ఎస్‌సీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బెస్ట్‌ అవుట్‌గోయింగ్‌ స్టూడెంట్స్‌ కోసం రూ.1.25 లక్షలు ఇండ్ల రామసుబ్బారెడ్డి అందించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు సీవీ సురేష్‌, గజ్జల వెంకటేశ్వరరెడ్డి, వెంకటజనార్ధన్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, భాస్కర్‌రావు, సాధు గోపాలకృష్ణ, జింకా మార్కండేయ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more