ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు

ABN , First Publish Date - 2022-12-02T00:12:41+05:30 IST

అభివృద్ధికి తాను అడ్డుకాదని, ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని మాజీ ఎంపీపీ శివరామిరెడ్డి అన్నారు.

ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు

మాజీ ఎంపీపీ శివరామిరెడ్డి

చెన్నూరు, డిసెంబరు 1: అభివృద్ధికి తాను అడ్డుకాదని, ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని మాజీ ఎంపీపీ శివరామిరెడ్డి అన్నారు. గురువారం చెన్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మార్కెట్‌ కమిటీ చైర్మన జీఎన భాస్కర్‌రెడ్డి, సర్పంచ వెంకటసుబ్బయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చెన్నూరులో సిమెంటు రోడ్ల నిర్మాణానికి, డ్రైనేజీ ఏర్పాటుకు దాదాపు రూ.కోటి నిధులు మంజూరు కావడం సంతోషమేనని, అయితే ప్రజలు ఇబ్బంది పడితే మాత్రం సహించేది లేదన్నారు. ప్రజల కోసం సొంత నిధులు అయినా ఖర్చు చేస్తానన్నారు. ఇటీవల చెన్నూరుకు మంజూరైన కోటి నిధుల విషయంలో తాను అడ్డు పడుతున్నానని స్థానికంగా కొందరు చెప్పడం తగదన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు తానెప్పుడు ముందుంటానన్నారు. కాకపోతే అభివృద్ధి పనులు ఎలా చేపట్టాలి, ఎలా చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టానుసారంగా పనులు చేపడితే మాత్రం ఒప్పుకునేదిలేదన్నారు. చెన్నూరులో చేపట్టిన డ్రైనేజీ వల్ల ఇప్పటికే అక్కడ వేసిన పైపులైన్లు, కేబుల్‌, విద్యుత స్తంభాలకు ఇబ్బంది కలుగుతుందని, ఇది కేవలం ఒక వైపు మాత్రమే చేయడం సమస్య తలెత్తుతుందన్నారు. మరో వైపు కూడా డ్రైనేజీ ఏర్పాటు చేస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు. తాగునీటి పైపులైను పైన డ్రైనేజీ కాల్వ నిర్మిస్తే పైపులు లీకై ఈ డ్రైనేజీ నీరు అందులోకి వెళితే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.ఈ విషయమై ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈతో మాట్లాడదామని పలుమార్లు ఫోన చేసినా స్పందించలేదన్నారు. అంతేకాక గ్రామ పంచాయతీలో రెజల్యూషన తీసుకోకుండానే పనులు ఎలా చేపట్టారన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన జీఎన భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు వైపులా డ్రైనేజీ ఏర్పాటు చేస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు. సమావేశంలో ఆకుల శ్రీనివాసులు, డి.నాగభూషణం, కొండపేట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:12:46+05:30 IST