రేపు హుస్సేన్‌ పీర్‌ దర్గా ఉరుసు

ABN , First Publish Date - 2022-08-22T05:19:15+05:30 IST

కడప-ఖమ్మం ప్రధాన రహదారి పోరుమామిళ్లలో వెలసిన హజరత్‌ హుస్సేన్‌ పీర్‌ స్వామి దర్గాలో ఈనెల 23 నుంచి ఉరుసు వేడుకలు నిర్వహిస్తున్నట్లు అంజుమన్‌ కమిటీ సభ్యులు తెలిపారు.

రేపు హుస్సేన్‌ పీర్‌ దర్గా ఉరుసు

పోరుమామిళ్ల, ఆగస్టు 21 : కడప-ఖమ్మం ప్రధాన రహదారి పోరుమామిళ్లలో వెలసిన హజరత్‌ హుస్సేన్‌ పీర్‌ స్వామి దర్గాలో ఈనెల 23 నుంచి ఉరుసు వేడుకలు నిర్వహిస్తున్నట్లు అంజుమన్‌ కమిటీ  సభ్యులు తెలిపారు. 23వ తేదీ మంగళవారం గంథం, 24న ఉరుసు, 25న తహ్లీం కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే హజరత్‌ గంజేషాహీద్‌ స్వామి దర్గాలో 24న గంథం, 25న ఉరుసు, 26న తహలీల్‌ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 24, 25 తేదీలలో రాత్రి 10 గంటలకు నాగ్‌పూర్‌కు చెందిన హబీబ్‌ అజ్మీరీ, ఢిల్లీకి చెందిన బేబివార్సీ, ముంబైకి చెందిన అన్వర్‌ జానీలతో గొప్ప ఖవ్వాలీ పోటీలు ఉంటాయన్నారు. హిందూ ముస్లింలు అందరూ ఈ ఉరుసు మహోత్సవానికి హాజరై జయప్రదం చేయాలన్నారు. 


Read more