-
-
Home » Andhra Pradesh » Kadapa » Housing construction should be accelerated-NGTS-AndhraPradesh
-
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-06-07T06:29:23+05:30 IST
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వి.విజయరామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జేసీ సీఎం సాయికాంత్ వర్మ, డీఆర్వో మాలోల, నగర కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్‌చంద్, హౌసింగ్ పీడీ కృష్ణయ్యతో కలసి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించారు.

అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
కడప(కలెక్టరేట్), జూన్ 6: గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వి.విజయరామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జేసీ సీఎం సాయికాంత్ వర్మ, డీఆర్వో మాలోల, నగర కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్‌చంద్, హౌసింగ్ పీడీ కృష్ణయ్యతో కలసి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. గ్రామాలు, వార్డుల పరిధిలో ఒన్ టైం సెటిల్ మెంట్ ప్రక్రియలో స్టేజ్ కన్వర్షన్, డిజిటల్ సైనింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. జగనన్న హౌసింగ్ పథకం ఎంతో ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నామని, అదేరీతిగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాల పరిధిలో ప్రతి ఇల్లు తిరిగి ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. నాడు నేడు పనుల నిర్మాణాల్లో ఎక్కడా కూడా జాప్యం జరగకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్డ్డీవోలు ధర్మచద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.