నిర్దేశించిన సమయంలో గృహ నిర్మాణాలు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-09-14T04:36:56+05:30 IST

పులివెందుల జగనన్న హౌసింగ్‌ కాలనీలో జరిగే గృహ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తిచేయాలని పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ వెం కటేశులు సూచించారు.

నిర్దేశించిన సమయంలో గృహ నిర్మాణాలు పూర్తిచేయాలి

పులివెందుల టౌన, సెప్టెంబరు 13: పులివెందుల జగనన్న హౌసింగ్‌ కాలనీలో జరిగే గృహ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తిచేయాలని పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ వెం కటేశులు సూచించారు. స్థానిక మున్సిపల్‌ కా ర్యాలయంలో మంగళవారం ఇంటి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ హౌసింగ్‌ కాలనీపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. ప్రతిరోజు పనుల పురోగతిని తనకు తెలపాలని అన్నారు. కాలనీ నిర్మాణంలో ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ నరసింహారెడ్డి, తహసీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి, మున్సిపల్‌ డీఈ గుర్రప్పయాదవ్‌, హౌసింగ్‌, మున్సిపల్‌ ఇంజనీర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.


Read more