ఆసుపత్రి కాన్పులే తల్లీబిడ్డకు సురక్షితం

ABN , First Publish Date - 2022-12-09T23:36:26+05:30 IST

సుశిక్షితులైన సిబ్బంది, సకల సదుపాయాలు ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులే తల్లీబి డ్డకు సురక్షితమని తలపుల పీహెచసీ వైద్యాధికారి చంద్రశేఖర్‌ నాయక్‌ పేర్కొ న్నారు.

ఆసుపత్రి కాన్పులే తల్లీబిడ్డకు సురక్షితం

పీలేరు, డిసెంబరు 9: సుశిక్షితులైన సిబ్బంది, సకల సదుపాయాలు ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులే తల్లీబి డ్డకు సురక్షితమని తలపుల పీహెచసీ వైద్యాధికారి చంద్రశేఖర్‌ నాయక్‌ పేర్కొ న్నారు. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన(పీఎంఎస్‌ఎంఏ) కార్యక్రమం లో భాగంగా శుక్రవారం పీహెచసీ పరిధి లోని గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు, అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలింతలు, నవజాత శిశువుల మరణాలను పూర్తిగా నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, వైద్య ఆరోగ్య సిబ్బంది సాయంతో వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అవసరమైన వారికి ఐరన ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచఈ కొండయ్య, సిబ్బంది సుబ్బమ్మ, కుసుమ, నాగవేణి, తదితరులు పాల్గొన్నారు.

వైద్య పరీక్షలు చేయించుకోవాలి

కలకడ, డిసెంబరు 9:గర్భిణులు క్రమం తప్పకుండా ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయిం చుకోవాలని ఎర్రకోటపల్లె ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్‌ జవహర్‌బాబు తెలిపారు. శుక్రవారం పీఎం ఎస్‌ఎంఏ కార్యక్రమంలో భాగంగా 35 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి 16 మందిని ఉన్నత వైద్యం కోసం సిపార సు చేశారు. జయరామయ్య, సుబ్బరత్నమ్మ, ముజీబ్‌బాష, రెడ్డెమ్మ, జమీల్‌బాష, ఇస్మాల్‌, ఆశాలు పాల్గొన్నారు.

నిమ్మనపల్లెలో 50 మందికి పరీక్షలు

నిమ్మనపల్లె, డిసెంబరు 9: ప్రధానమంత్రి సురక్షా మాతృత్వ అభియాన ద్వారా 50మంది గర్భి ణులకు వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి జులేఖాభేగం తెలిపారు. స్థానిక ఆసుపత్రిలో రక్త పరీక్షలు, బీపీ, షుగర్‌ పరీక్షలు చేశామన్నారు. ఇందులో 10మంది హై రిస్క్‌ గర్భిణులను గు ర్తించి వారిలో 8మం ది ని మదనపల్లె, తిరుప తికి రెఫర్‌ చేశామన్నా రు. ఏఎనఎమ్‌లు, ఆశా లు, పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:36:29+05:30 IST