న్యాయవాదులకు ఇంటి స్థలాలు కేటాయించాలి

ABN , First Publish Date - 2022-05-31T05:27:53+05:30 IST

రాజంపేటలోని న్యాయవాదులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్‌ ధరకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో న్యాయవాదులు తహసీల్దారు శిరీషకు వినతిపత్రం అందించారు. రాజంపేట కోర్టులో అనేక మంది పేద న్యాయవాదులు ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

న్యాయవాదులకు ఇంటి స్థలాలు కేటాయించాలి
తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న బార్‌ అసోసియేషన్‌ నేతలు

తహసీల్దారుకు బార్‌ అసోసియేషన్‌ వినతి

రాజంపేట, మే 30: రాజంపేటలోని న్యాయవాదులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్‌ ధరకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో న్యాయవాదులు తహసీల్దారు శిరీషకు వినతిపత్రం అందించారు. రాజంపేట కోర్టులో అనేక మంది పేద న్యాయవాదులు ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే విధంగా రాజంపేట కోర్టు భవనాల కోసం స్థలం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు సింగంశెట్టి కృష్ణకుమార్‌, ఆనంద్‌, సురేష్‌, సుబ్బరాజు, సురేంద్ర, రమే్‌షనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read more