భారీ ఈదురు గాలులు, వర్షం... విరిగిపడిన చెట్లు

ABN , First Publish Date - 2022-09-29T05:30:00+05:30 IST

ప్రొద్దుటూరు పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.

భారీ ఈదురు గాలులు, వర్షం... విరిగిపడిన చెట్లు
తహసీల్దారు కార్యాలయం వద్ద విరిగి పడిన చెట్లు

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు


ప్రొద్దుటూరు అర్బన్‌, సెప్టెంబరు 29: ప్రొద్దుటూరు పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విరిగిన చెట్లు విద్యుత్‌లైన్ల మీద పడడంతో కరెం టు తీగలు తెగి విద్యుత్‌ స్తంభాలు విరిగాయి. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాద ఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం తహసీల్దారు కార్యాలయం ఆవరణ, మైదుకూరు రోడ్డు, ఆర్ట్స్‌ కాలేజి నాలుగు రోడ్లు, హనుమాన్‌ నగర్‌, మహేంద్ర నగర్‌, శ్రీరాంనగర్‌ తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగిన ప్రదేశాలను విద్యుత్‌ అధికారులు పరిశీలించారు. చెట్ల కొమ్మలను తొలగించారు. తెగిపడిన విద్యుత్‌ లైన్లను కరెంటు ఫోల్స్‌ను పునరుద్దరించే పనులను యుద్దప్రాతిపదినక చేపట్టారు. ప్రొద్దుటూరు అర్బన్‌ ఏరియాలో దాదాపు ఇప్పటివరకు 16 విద్యుత్‌ స్తంభాలు విరిగి లైన్లు పాడయి పోయినట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ ప్రొద్దుటూరు డివిజనల్‌ ఈఈ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు రూరల్‌ పరిధిలో ఎన్ని విద్యుత్‌ స్తంభాలు లైన్లు దెబ్బతిన్నవి ఇంకా వివరాలు అందుబాటులోకి రాలేదన్నారు. 

Updated Date - 2022-09-29T05:30:00+05:30 IST