-
-
Home » Andhra Pradesh » Kadapa » High Court Judge in the presence of Kodandaram-MRGS-AndhraPradesh
-
కోదండరాముడి సన్నిధిలో హైకోర్టు జడ్జి
ABN , First Publish Date - 2022-10-04T05:30:00+05:30 IST
ఏకశిలా నగిరి కోదండ రామాలయాన్ని మంగళవారం హైకోర్టు జడ్జి రవినాథ్ తిలహరి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగ తం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఒంటిమిట్ట /రాజంపేట, అక్టోబరు 4: ఏకశిలా నగిరి కోదండ రామాలయాన్ని మంగళవారం హైకోర్టు జడ్జి రవినాథ్ తిలహరి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగ తం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగమండపంలో ఆలయ చరిత్రను తెలియజేసి వేదపండితులు ఆశీర్వచనం నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నందలూరు సివిల్ జడ్జి కె.లత, ఎస్ఐ సంజీవరాయుడు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
రాజంపేటలో సత్కారం
హైకోర్టు జడ్జి రవినాథ్ తిలహరిని రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.లక్ష్మీనారాయణ అధ్వర్యంలో మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజంపేట కోర్టు సమస్యలను, న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైకోర్టు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆనంద్, జాయింట్ సెక్రటరీ కత్తి సుబ్బరాయుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామాంజనేయులు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.