పోషక పదార్ధాల లోపంతోనే గుండెజబ్బులు

ABN , First Publish Date - 2022-09-30T05:23:34+05:30 IST

జంతువుల్లో పోషక పదార్ధాల లోపం తోనే గుండెజబ్బులు వస్తాయని పశువైద్యకళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్ట ర్‌ వి.వైకుంఠరావు, లక్ష్య కార్డియాల జిస్ట్‌ డాక్టర్‌ శ్రీనాధ రెడ్డి పేర్కొన్నారు.

పోషక పదార్ధాల లోపంతోనే గుండెజబ్బులు
సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్య కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీనాధరెడ్డి

ప్రొద్దుటూరు రూరల్‌, సెప్టెంబరు 29: జంతువుల్లో పోషక పదార్ధాల లోపం తోనే గుండెజబ్బులు వస్తాయని పశువైద్యకళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్ట ర్‌ వి.వైకుంఠరావు, లక్ష్య కార్డియాల జిస్ట్‌ డాక్టర్‌ శ్రీనాధ రెడ్డి పేర్కొన్నారు.  గోపవరం సమీప పశువైద్య కళాశాల లో గురువారం ప్రపంచ హృదయ ది నోత్సవం సందర్భంగా పాడి పశువు లు, పెంపుడు జంతువుల్లో వచ్చే గుం డె జబ్బులపై నిర్వహించిన వర్క్‌షా పులో వారు మాట్లాడుతూ పోషకాహా ర ప్రభావం - పశువుల్లో సంభవించే గుండె వ్యాధులపై అవగాహన కల్పించడమే ఈ వర్క్‌షాపు ఉద్దేశమన్నారు. పశువులు, పెంపుడు జంతువుల్లో వచ్చే గుండె జబ్బులు నిర్ధారణ, నివారణ చికిత్స గురించి ఆయన వివరించారు. కార్యక్రమంలో ఇండియన్‌ సొసైటీ ఫర్‌ వెటర్నరీ కార్డియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌, పశువైద్య కళాశాల, ఓఎ్‌సఏ ప్రొఫెసర్‌ వినోద్‌కుమార్‌, డాక్టర్‌ సుధాకరరెడ్డి, ఇతర విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బం ది, విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T05:23:34+05:30 IST