మోటార్లకు మీటర్ల కంటే ఉరితాళ్లే నయం

ABN , First Publish Date - 2022-10-01T04:46:29+05:30 IST

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం కంటే రై తుల మెడలకు ఉరితాళ్లు వేసి ఒక్కసారిగా చంపేయడమే మేలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అన్నమయ్య జిల్లా నేత మావులూరి విశ్వనాధ్‌ ఆవేదన వ్యక్తం చేశా రు.

మోటార్లకు మీటర్ల కంటే ఉరితాళ్లే నయం
నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం

ధర్నాలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేత
రాయోటిటౌన్‌, సెప్టెంబరు30:
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం కంటే రై తుల మెడలకు ఉరితాళ్లు వేసి ఒక్కసారిగా చంపేయడమే మేలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అన్నమయ్య జిల్లా నేత మావులూరి విశ్వనాధ్‌ ఆవేదన వ్యక్తం చేశా రు. శుక్రవారం రైతు కూలీలతో కలిసి రాయచోటి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రైతులను మోసం చేయడంలో పోటీ పడుతున్నారని ఆరోపించారు. మీటర్లు వేయించుకోని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు బెదిరిస్తు న్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్‌ అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతు కూలి సంఘం నేతలు రమణ, మదన్‌, పెద్దినాయుడు, రాజేంద్రప్రసాద్‌, నీలావతి, చలపతి, బాబు, రమే్‌షనాయుడు పాల్గొన్నారు.

Read more