జోడో యాత్రకు విశేష స్పందన

ABN , First Publish Date - 2022-09-30T05:50:57+05:30 IST

రాహుల్‌ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని భారత్‌ జోడోయాత్ర రాష్ట్ర సమన్వయకర్త, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసి రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో రాష్ట్రంలో జోడో యాత్రకు

జోడో యాత్రకు విశేష స్పందన
మాట్లాడుతున్న భారత్‌ జోడో యాత్ర రాష్ట్ర సమన్వయకర్త తులసిరెడ్డి

భారత్‌ జోడో యాత్ర రాష్ట్ర సమన్వయకర్త తులసిరెడ్డి

కడప(కలెక్టరేట్‌), సెప్టెంబరు 29: రాహుల్‌ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని భారత్‌ జోడోయాత్ర రాష్ట్ర సమన్వయకర్త, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసి రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో రాష్ట్రంలో జోడో యాత్రకు సన్నాహక సమావేశం జరిగింది. అంతకు ముందు పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. వ్యవసాయ రుణాల కోసం ప్రతి రైతుకు ఏడాదికి మూడు లక్షలు, వంట గ్యాస్‌ రూ.500లకు అందజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంజీవిని లాంటి ప్రత్యేక హోదాపై తొలి సంతకం, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ ఖండ్‌ తరహాలో ప్రత్యేక అబివృద్ధి ప్యాకేజీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా జోడోయాత్ర శిక్షకులు నారాయణ స్వామి, జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతంరెడ్డి, ిపీసీసీ డెలిగేట్స్‌ బండి జకరయ్య, తిరుమలేశు, బాబు, లక్ష్ముయ్య, పుల్లయ్య, శ్యామలాదేవి, నాగరాజు, ఆరీపుల్లా తదితరులు పాల్గొన్నారు.

Read more