వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం: జేసీ

ABN , First Publish Date - 2022-10-02T05:15:57+05:30 IST

వృ ద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రా ధాన్యం ఇస్తోందని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు.

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం: జేసీ
సీనియర్‌ సిటిజన్‌ను సన్మానిస్తున్న జేసీ తమీమ్‌ అన్సారియా

రాయచోటి(కలెక్టరేట్‌), అక్టోబరు 1: వృ ద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రా ధాన్యం ఇస్తోందని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. కలెక్టరే ట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు లో శనివారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఓటుహక్కు ఎక్కువసార్లు వినియోగించుకున్న పి.నర సింహులు, ఎస్‌.మహమ్మద్‌, ఎన్‌.ఆంజనే యులు, వీరనాగయ్యలను జేసీ  సన్మా నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ సీనియర్‌ సిటిజన్లను సన్మానించ డం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్య క్రమంలో డీఆర్‌వో సత్యనారాయణ, కలె క్టరేట్‌ కో-ఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరింటెం డెంట్‌ శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట: రాజంపేటలో శనివారం పెన్షనర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు పిల్లి పిచ్చయ్య అధ్వర్యంలో ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వయోవృద్ధులను సత్కరించారు. ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు వేం పల్లె సుబ్బన్న లక్ష్మీ నారాయణ స్వామిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.కృష్ణయ్య, ట్రెజరర్‌ జి.వి.చలపతి, ఉపాధ్య క్షుడు గౌస్‌ బాషా, జాయింట్‌ సెక్రటరీ కె.నరసింహులు, వసంత రా యులు తదితరులు పాల్గొన్నారు. తహ సీల్దారు కార్యాలయ ఆవరణలో సీనియర్‌ సిటిజన్లను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ అధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read more