ప్రభుత్వ భూములను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2022-12-30T22:59:29+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ భూమి ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని కలెక్టర్‌ గిరీషా అధికారులను ఆదే శించారు.

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలి

ప్రతి తహసీల్దార్‌ 100 ఎకరాల భూమి గుర్తించాలి

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), డిసెంబరు 30: జిల్లాలో ప్రభుత్వ భూమి ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని కలెక్టర్‌ గిరీషా అధికారులను ఆదే శించారు. కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ భూ సేకరణ, రీసర్వే, ఎస్సీ, ఎస్టీ కాలనీలో శ్మశాన వాటికల స్థలాలు గుర్తింపు తదితర అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభు త్వం పేద ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. జిల్లాలో అర్హులైన పేదలకు భూమి ఇచ్చేందుకు 30 మండలాల్లో ప్రతి తహసీల్దార్‌ కనీసం 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని గుర్తించి రిపోర్టు పంపాలన్నారు. ఈ భూమి ఎస్సీ, ఎస్టీ పేదలకు పంపిణీ చేస్తామని, ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు గుర్తించిన ప్రభుత్వ భూమితో పా టు ఎస్సీ, ఎస్టీల అర్హుల జాబితా వెంటనే పంపాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రీసర్వే పూర్తయి వివిధ కారణాలతో భూహక్కు పత్రాలు పంపిణీ చేయని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకుని త్వరితగతిన భూహక్కు పత్రాలు పంపిణీ చేయాలన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే పక్కాగా పకడ్బందీగా చేపట్టాలన్నారు. రీసర్వే పనులు పక్కాగా చేయకపోతే రెండో సారి చేయాల్సి వస్తుందన్నా రు. జిల్లాలోని సర్వే సిబ్బంది సమన్వయం తో గడువులోగా ఈకార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో రాయచోటి, రాజంపేట, మదనపల్లె ఆర్డీఓలు రంగస్వా మి, కోదండరామిరెడ్డి, మురళి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T22:59:34+05:30 IST