మెప్మాలో గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2022-09-08T05:42:27+05:30 IST

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో గోల్‌మాల్‌ చోటు చేసుకుంది. డ్వాక్రా మహిళలు పోగు చేసుకున్న సొమ్మును కొందరు సిబ్బంది కాజేశారు. లక్ష రెండు లక్షలు కాదు.. సుమారు రూ.40.70 లక్షలు స్వాహా అయినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం మెప్మాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

మెప్మాలో గోల్‌మాల్‌

సిబ్బంది చేతివాటం

మహిళా సమాఖ్యలో రూ.40.70 లక్షలు మాయం

(కడప - ఆంధ్రజ్యోతి):  పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో గోల్‌మాల్‌ చోటు చేసుకుంది. డ్వాక్రా మహిళలు పోగు చేసుకున్న సొమ్మును కొందరు సిబ్బంది కాజేశారు. లక్ష రెండు లక్షలు కాదు.. సుమారు రూ.40.70 లక్షలు స్వాహా అయినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం మెప్మాలో హాట్‌ టాపిక్‌గా మారింది. డ్వాక్రా మహిళలు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. కడప నగరంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 200 స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్‌ సంఘాలు ఉన్నాయి. ఆయా స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్లు టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌లో పొదుపు చెల్లిస్తుంటాయి. ఇందులో భాగంగా పడమటి మహిళా సమాఖ్య (టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌)లో పెద్ద ఎత్తున ఆ పరిధిలోని ఎస్‌ఎల్‌ఎఫ్‌ గ్రూపులు పొదుపు చేసుకున్నారు. అయితే సుమారు రూ.40.70 లక్షల రుణాన్ని సిబ్బంది కాజేసినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో మెప్మా ఇన్చార్జి పీడీ సురే్‌షరెడ్డి పడమటి మహిళా సమాఖ్య కార్యాలయంలో విచారణ నిర్వహించారు. రికార్డులన్నీ పరిశీలించారు. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి దశల వారీగా రూ.15.70 లక్షల దాకా డ్రా చేసినట్లు గుర్తించారని తెలిసింది. ఇంకా విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయితే ఎంత నిధులు గోల్‌మాల్‌ జరిగింది.. ఏ విధంగా నిధులు దారి మళ్లించారు.. అన్న విషయాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై ఇన్చార్జి మెప్మా పీడీ సురే్‌షరెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఫోన్‌ చేసినా స్విచ్చా్‌ఫలో ఉంది. 

Updated Date - 2022-09-08T05:42:27+05:30 IST