భారత్‌ జోడో యాత్రకు తరలిరండి

ABN , First Publish Date - 2022-10-09T04:55:48+05:30 IST

అఖిల భారత కాంగ్రెస్‌పార్టీ జాతీ య నాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు తరలిరావాలని పీసీసీ ఉపా ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా పిలుపునిచ్చారు.

భారత్‌ జోడో యాత్రకు తరలిరండి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

 15న అనంతపురం చేరనున్న యాత్ర  మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

మదనపల్లె రూరల్‌, అక్టోబరు 8: అఖిల భారత కాంగ్రెస్‌పార్టీ జాతీ య నాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు తరలిరావాలని   పీసీసీ ఉపా ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడు తూ ఈనెల 15న రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో భాగంగా 10కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. అనంతరం తిరిగి ఈనెల 18, 19, 20, 21 తేదీల్లో నాలుగురోజులు మన రాష్ట్రంలో పాదయాత్ర ఉంటుందన్నారు. ప్రస్తుతం బీజేపీ పాలనలో  ప్రభుత్వ ఆస్తులన్నీ అదానీ, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తున్నారని విమర్శించారు. అందుకోసమే తమ నాయకుడు రాహులగాంధీ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేపట్టారన్నారు.  కార్యక్రమంలో ఏపీ పీసీసీ సభ్యుడు షంషీర్‌, నాయకు లు నాగూర్‌వలీ, వేమయ్య, రెడ్డిసాహెబ్‌, ఇంతియాజ్‌, నజీర్‌ , రాజేష్‌, రెడ్డి భూ తదితరులు పాల్గొన్నారు. 


Read more