ఘనంగా టీసీసీ చర్చి శతాబ్ది ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-01-24T04:21:52+05:30 IST

మండల పరిధిలోని ఉప్పరపల్లెలో తెలుగు క్రిస్టియన్‌ కౌన్సిల్‌ (టీసీసీ) చర్చి నిర్మించి వందేళ్లు అయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా టీసీసీ చర్చి శతాబ్ది ఉత్సవాలు

ప్రొద్దుటూరు టౌన్‌, జనవరి 23 : మండల పరిధిలోని ఉప్పరపల్లెలో తెలుగు క్రిస్టియన్‌ కౌన్సిల్‌ (టీసీసీ) చర్చి నిర్మించి వందేళ్లు అయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం చర్చి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ పాస్టర్‌ ఇమ్మానుయేల్‌ మాట్లాడుతూ 1909 నుంచి 1922 వరకు మద్రాసు టీసీసీ ఆధ్వర్యంలో శ్రీపతి బార్నబాస్‌ గ్రామంలో చర్చి నిర్మాణానికి కృషి చేశారన్నారు. ఆయన మద్రాసు నుంచి ఎద్దుల బండ్లపై నిర్మాణ సామాగ్రిని తీసుకొచ్చి 1922లో చర్చిని నిర్మించారన్నారు. వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను శ్రీపతి కుటుంబ సభ్యులు సంఘ సభ్యులతో ఘనంగా నిర్వహించామన్నారు. ప్రార్థనల అనంతరం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. 

Read more