వైభవంగా నరసింహస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-11-23T00:16:47+05:30 IST

గుర్రంకొండ మండలం తరిగొండ లక్ష్మీనరసింహస్వా మి ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని మం గళవారం వేద పండితులు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా నరసింహస్వామి కల్యాణం
పత్యేక అలంకరణలో స్వామి వారు

గుర్రంకొండ, నవంబరు 22:గుర్రంకొండ మండలం తరిగొండ లక్ష్మీనరసింహస్వా మి ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని మం గళవారం వేద పండితులు వైభవంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు కల్యాణం నిర్వహించడం అనవాయితీ. ఇందులో భాగంగా ఉదయాన్నే స్వామివారిని మేల్కొలిపి ఆలయశుద్ధి, తోమాలసేవ, అర్చన, పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించి వేద పండితులు స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా చేశారు. స్వామి వారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. కార్యక్రమంలో అర్చకులు గోపాల్‌భట్టార్‌, కృష్ణప్రసాద్‌, కృష్ణరాజ్‌, అనిల్‌, గోకుల్‌, వెంకీ, వరద, ఆలయాధికారి కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:16:47+05:30 IST

Read more