ఘనంగా నారాలోకేశ్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-01-24T04:55:01+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను తెలుగునాడు విద్యార్థి సమా ఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సాయిశ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా నారాలోకేశ్‌ జన్మదిన వేడుకలు
వృద్ధులకు భోజనం వడ్డిస్తున్న టీడీపీ నాయకులు

పులివెందుల, జనవరి 23: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను తెలుగునాడు విద్యార్థి సమా ఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సాయిశ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  పట్టణ సమీపంలోని లీలావతి అనాథ శరణాలయంలో వృద్ధుల కు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సాయిశ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లోకేశ్‌ ఆదర్శాలను కొనసాగిస్తామని రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు ఆయనకు ఎప్పటికీ ఉంటాయన్నారు.  కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి బొజ్జ మైసూరారెడ్డి, తెలుగు యువత నాయకులు వెంకటేశ్వరరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, దినే్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చక్రాయపేటలో:  మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కర్ణాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో  కేక్‌లు కట్‌ చేసి పంపిణీ చేశారు.  కాగా గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో  టీడీపీ జిల్లా కార్యదర్శి బొజ్జా మైసూరారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సాయిశ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బొందలకుంట ఈశ్వర్‌రెడ్డి, కృష్ణగిరి రమేష్‌, ఎరికలరెడ్డి, రామాంజనేయులు, నారాయణరెడ్డి, మహదేవపల్లె ప్రసాద్‌, సిద్దయ్య, చిన్నరామయ్య, మల్లేపల్లె రామచంద్ర, చిలేకాంపల్లె రామాంజి, మల్లేష్‌, శివ, అశోక్‌, రామకృష్ణయాదవ్‌, బొజ్జ గంగచంద్రారెడ్డి, రఫి, తాళ్లపల్లె వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

ఖాజీపేటలో:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ జన్మదినం సందర్భంగా  టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,  కేసీకెనాల్‌ ప్రాజెక్టు వైస్‌ఛైర్మన్‌ రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు.  కార్యక్రమంలో పార్టీ నేతలు మల్లె ఓబయ్యయాదవ్‌, ముత్తూరు రఘురామిరెడ్డి, కమలాపురం గౌస్‌, రామాంజనేయులు, దాసరి రవి, రెడ్యం నాగేశ్వరరెడ్డి , నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోరుమామిళ్లలో : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ్‌ జన్మదిన వేడుకలు పోరుమామిళ్ల సర్పంచ్‌ యనమల సుధాకర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి పోరుమామిళ్లలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సీతావెంకటసుబ్బయ్య, తోటబ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, మస్తాన్‌, సర్వేష్‌, భరత్‌, రామ్మోహన్‌, సుబ్బరాయుడు, దర్సి బాలాజీ పాల్గొన్నారు. 

సింహాద్రిపురంలో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా లోకే్‌షకు ఆయురారోగ్యాలు, అన్ని శుభాలు నెలకొనాలని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్‌ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆదేశాల మేరకు మండలంలోని భానుకోట ప్రముఖ శైవక్షేత్రంలో ఆదివారం ఆయుష్య హోమం, అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సోదరుడు టీడీపీ మండల అధ్యక్షుడు జోగిరెడ్డి, ఎమ్మెల్సీ కుమారుడు మారెడ్డి రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేశారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కులుగారి విజయకుమార్‌రెడ్డి, అన్నారెడ్డి ప్రసాద్‌రెడ్డి, నాగభూషణ్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, మార్థల జగన్‌రెడ్డి, మురళీ యాదవ్‌, పుప్పాల వర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

చాపాడులో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పుట్టినరోజు సందర్భంగా పల్లవోలు గ్రామం వద్ద ఉన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఆదివా రం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మునిశేఖర్‌రెడ్డి అన్నదానం చేశారు.  కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి,  నా యకులు  వైవీ సుబ్బారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాయబ్‌రసూల్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, అక్బర్‌ సలీం, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more