బాలికలు తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలి

ABN , First Publish Date - 2022-11-11T23:36:17+05:30 IST

బాలికలు కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చాపాడులోని కస్తూర్బాగాంధీ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం జరిగిన బేటీబచావో, బేటీపఢావో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

బాలికలు తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలి

చాపాడు, నవంబరు 11: బాలికలు కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చాపాడులోని కస్తూర్బాగాంధీ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం జరిగిన బేటీబచావో, బేటీపఢావో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆడపిల్లలను రక్షించాలని వారిని చదివించాలన్నారు. ఎంఈవో రవిశంకర్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ బాలికలకు నాణ్యమైన విద్య అందించేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:36:47+05:30 IST

Read more