పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయించండి

ABN , First Publish Date - 2022-11-02T23:17:23+05:30 IST

సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు నిర్మించాం బిల్లులు ఇప్పించాలని పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సుబ్బారెడ్డికి స్థానిక నేతలు విజ్ఞప్తి చేశారు.

పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయించండి
నేతలతో మాట్లాడుతున్న ఈఎన్‌సీ సుబ్బారెడ్డి

ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ను కోరిన స్థానిక నేతలు

వేంపల్లె, నవంబరు 2: సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు నిర్మించాం బిల్లులు ఇప్పించాలని పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సుబ్బారెడ్డికి స్థానిక నేతలు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ రాజ్‌ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చే శారు. స్థానిక నాయకులు, జడ్పీటీసీ సభ్యులు రవికుమార్‌రెడ్డి సహా పంచాయతీ రాజ్‌ ఈఈ, డీఈ, ఏఈలతో అభివృద్ధి పనుల గురించి చర్చించారు. స్థానిక నేతలు జర్రిపీటి సుధాకర్‌ తదితరులు బిల్లులురాలేదని ఈఎన్‌సీ దృష్టికి తీసుకెళ్లగా పనులు పూర్తయ్యాయా, బిల్లులు అప్‌లోడ్‌ చేశారా అని స్థానిక ఇంజనీరింగ్‌ అధికారులను అడిగారు. త్వరలోనే బిల్లులు వస్తాయని ఆయన చెప్పారు.

Updated Date - 2022-11-02T23:17:23+05:30 IST
Read more