గాయత్రీమాత.. నమోస్తుతే...

ABN , First Publish Date - 2022-09-29T05:47:29+05:30 IST

దసరా శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం వాసవీమాత గాయత్రీమాతగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించి కనువిందుచేశారు.

గాయత్రీమాత.. నమోస్తుతే...
మదనపల్లెలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు


మదనపల్లె అర్బన్‌, సెప్టెంబరు 28: దసరా శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  మూడో రోజైన బుధవారం వాసవీమాత గాయత్రీమాతగా  భక్తులకు దర్శనభాగ్యం కల్పించి కనువిందుచేశారు. పట్టణంలోని వాసవీభవన్‌ వీధిలోగల వాసవీ కన్నకాపరమేశ్వరీదేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళాసంఘాల సభ్యులు మహిళలు, ఆర్యవైశ్యులు అధికసంఖ్యలో పాల్గొని గాయత్రీ అలంకరణలో ఉన్న అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. జనరల్‌ మర్చెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అమ్మవారిశాలల్లో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమం లో మదనపల్లె ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్‌, ట్రెజరర్‌ సూరేగిరిధర్‌, సెక్రటరీ దేవత సతీష్‌  పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని కోర్టు ఆవరణలో ఉన్న కోర్టులో గంగమ్మ ఆలయంలో అమ్మవారిని గంధంతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు పొంగళ్లు నైవేధ్యంతో ఆలయానికి తరలి వచ్చి చీర, సారెను సమర్పించారు. సీటీ ఎం రోడ్డు దేవతానగర్‌లోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో ధర్మకర్త పతాంజలీ స్వామి ఆధ్వర్యంలో అమ్మవారిని అన్నపూర్ణేశ్వరీదేవిగా ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.  నీరుగుట్టువారిపల్లెలో తొగటుల ఆరాధ్య దైవం చౌడేశ్వరీదేవిని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర, సెక్రటరీ గుండ్లపల్లె ప్రభాకర్‌, ట్రెజరర్‌ రామిశెట్టి లోకేష్‌ ఆధ్వర్యంలో సాయంత్రం వెండికవచంతో అలంకరింపజేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.  ఆలయకమిటీ సభ్యులు, తొగటక్షత్రియసం ఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, అన్నమయ్య జిల్లాఅధ్యక్షుడు భోజనపు వెంకటనారాయణ, గౌరవాధ్యక్షుడు మోడెం వెంకటరమణ, తొగట కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ శీలం రమణమ్మ రమే్‌షబాబు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు. వరాల ఆంజనేయస్వామి ఆలయంలో శర్ననవరాత్రి ఉత్సవవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం  సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. చిప్పిలిగ్రామంలోని అయ్యప్పస్వామి ఆలయంలో దసరా సందర్భంగా ఆలయకమిటీ సభ్యు లు స్వామివారిని వివిధ అలంకరణలలో  పూజలు చేస్తున్నారు.   

గుర్రంకొండలో:గుర్రంకొండ మండలం చెర్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మ అమ్మవారు బుధవారం గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.  ఉత్సవాలలో భాగంగా ఉదయాన్నే అర్చన, అభిషేకాలను నిర్వహించా రు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

కలకడలో:కలకడ, కోనలో వెలసిన చౌడేశ్వరిదేవి ఆలయాలలో బుధ వారం గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఉదయాన్నే అర్చన, అభిషేకా లను చేశారు. పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో:దేవీ శరన్నవరాత్రుల వేడుకలలో భాగంగా బుధవా రం వాసవీ అమ్మవారి ఆలయంలో బాలాత్రిపుర సుందరీదేవి అలంక రణ చేసి పూజలు చేశారు. కోనేటివీధిలోని కామేశ్వరస్వామి ఆల యంలో అమ్మవారు వైష్ణవిదేవిగాను, కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం లో అమ్మవారు శారదాదేవిగానూ, నల్లవీరగంగాభవానీ ఆలయంలో సమయపురం మారియమ్మ అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయాల చెంత భక్తులకు తీర్థ ప్రసాద పంపిణీ అన్న దాన కార్యక్రమాలు నిర్వహించారు. ్జకార్యక్రమాలలో ఆలయాల ధర్మకర్తలు కాంతరాజు, కువైట్‌ శంకరా చారి, తబ్బుల సతీష్‌, అర్చకు లు శీనాస్వామి, సత్యనారాయణశాస్త్రి, సుధీర్‌, భక్తులు పాల్గొన్నారు. 

పీలేరులో: పీలేరు ఇందిరమ్మ కాలనీ సమీపంలో వెలసిన దిన్నె గంగ మ్మ అమ్మవారు దసరా ఉత్సవాల్లో భాగంగా బుధవారం గాయత్రీ దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా నెహ్రూబజారు లోని కన్యకాపరమేశ్వరి అమ్మవారు గాయత్రీదేవిగా, ప్రభుత్వ ఆసుప త్రిలోని రౌద్రాల అంకాళమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు.  మహిళ లు పెద్దఎత్తున అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్ర మాల్లో ఆయా ఆలయాల కమి టీ సభ్యులు పి.వెంకటమ్మ, రామిరెడ్డి, భాస్కరరెడ్డి, పూజారులు భరత్‌, చంద్రశేఖర శర్మ, ఆంజి పాల్గొన్నారు. 

నిమ్మనపల్లెలో: మండలంలోని నిమ్మనపల్లె పెద్దదళితవాడలో వెలసిన  మాతమ్మతల్లి ఆలయంలో దసరా నవరాత్రులలో భాగంగా బుధవారం రెండో రోజున అమ్మవారు కుంకుమ అలంరణలో దర ్శనం ఇచ్చారు.  తొమ్మిదేళ్లుగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. 

ములకలచెరువులో: స్థానిక పీటీఎం రోడ్డులో వెలసిన వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి అమ్మవారు బుధవారం డ్రైఫూడ్స్‌ అలంకరణలో భక్తుల కు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని డ్రైఫూడ్స్‌తో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కలికిరిలో: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం నాడు కలికిరి గ్రామ దేవత యల్లమ్మ గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారికి దివ్య రూపం తో అలంకరణలు పూర్తి చేసిన అనంతరం భక్తుల దర్శనానికి వెసులు బాటు కల్పించారు. ఆలయ నిర్వాహకులు అశోక్‌ రెడ్డి, మధుసూదన రెడ్డి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. 

Read more