రాష్ట్రస్థాయి పోటీలకు గ్యారంపల్లె విద్యార్థులు

ABN , First Publish Date - 2022-11-30T23:48:55+05:30 IST

కేవీపల్లె మండలం గ్యారంపల్లెలోని ఏపీ ఆర్‌జేసీ పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఏపీఆర్‌ జేసీ ప్రిన్సిపాల్‌ శివయ్య తెలిపా రు.

రాష్ట్రస్థాయి పోటీలకు గ్యారంపల్లె విద్యార్థులు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ శివయ్య, అధ్యాపకులు

పీలేరు, నవంబరు 30: కేవీపల్లె మండలం గ్యారంపల్లెలోని ఏపీ ఆర్‌జేసీ పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఏపీఆర్‌ జేసీ ప్రిన్సిపాల్‌ శివయ్య తెలిపా రు. అండర్‌-19 ఖో-ఖో పోటీలకు యోగీశ్వర్‌, సాఫ్ట్‌బాల్‌కు ఓంకార్‌ నాయక్‌, బాస్కెట్‌బాల్‌కు నవీన, ఆర్చరీకి పరమేశ్వర్‌, అండర్‌-17 టెన్నీకాయిట్‌ పోటీలకు ప్రభాస్‌, యోగాకు లక్ష్మీకాంతరెడ్డి, ఫెన్సింగ్‌కు ఇబ్రహీమ్‌ ఎం పికైనట్లు ఆయన వివరించారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభను కనబ రిచిన వారు త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అధ్యాప కులు చెన్నకేశవులు, భూపతిరావు, రామకృష్ణాంజనేయులు, రమాదేవి, అన్నపూర్ణ అభి నందించారు.

Updated Date - 2022-11-30T23:48:55+05:30 IST

Read more