గాంధీజీ ఆశయ సాధనకు పాటుపడాలి

ABN , First Publish Date - 2022-08-16T04:32:27+05:30 IST

పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మల ని అవి స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి పధంలో పయనిస్తుందని గాంధీజీ చెప్పిన మాటలను ఆచరణ రూపంలోకి తెచ్చేందుకు సీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు త్వం చర్యలను చేపడుతోందని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

గాంధీజీ ఆశయ సాధనకు పాటుపడాలి

పల్లెసీమల ప్రగతికి నడుం బిగించాలి 

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో మంత్రి ఆదిమూలపు సురేష్‌

కడప రూరల్‌, ఆగష్టు 15: పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మల ని అవి స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి పధంలో పయనిస్తుందని గాంధీజీ చెప్పిన మాటలను ఆచరణ రూపంలోకి తెచ్చేందుకు సీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభు త్వం చర్యలను చేపడుతోందని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ఆయన మా ట్లాడుతూ మన పెద్దలు సాదించిపెట్టిన స్వాతంత్య్ర ఫలాను అర్హులకు అందిస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, అభివృద్దికి పాటుపడుతున్నామన్నారు. జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచిపేరు తేవాలని ఆయ న కోరారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పధకాలను అర్హులకు ప్రభుత్వ లక్ష్యసాధనకు పాటుపడాలన్నారు. 

కారుణ్య నియామక ఉద్యో పత్రాలు

 జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయ పరిదిలో ధరఖాస్తు చేసుకు న్న ఎనిమిది మందికి కారుణ్య నియామక  ఉద్యోగాలను కల్పించారు. వీరికి నియామక పత్రాలను జడ్పీలో నిర్వహించి న స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో జిల్లా ఇన్‌ చార్జ్‌ మంత్రి అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ పిట్టు బాలయ్య, సీఈఓ మన్నూరు సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ రమణారెడ్డి, ఏపీపీఆర్‌ ఎంఈఏ రాష్ట్ర, జిల్లా నేతలు ఆర్‌. నాగిరెడ్డి, లంకా మల్లేశ్వరరెడ్డి,  సిబ్బంది పాల్గొన్నారు. 

 జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ఉమ్మడి కడప జిల్లాలోని జడ్పీ పరిధిలోని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 30 మందికి మంత్రి  ప్రశంసా పత్రాలను అందజేశారు. 

Read more