వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

ABN , First Publish Date - 2022-04-25T04:59:00+05:30 IST

జిల్లా వ్యాప్తంగా జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమా దాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
మహేష్‌ మృతదేహ

ఇద్దరు యువకులు 

ఒక వృద్ధుడు

చికిత్స పొందుతూ ఒక మహిళ

 జిల్లా వ్యాప్తంగా జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమా దాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం వెంకటమ్మపేట వద్ద వైఎస్‌ఆర్‌ కడప జిల్లా గోపవరం మండలం కాల్వపల్లె వాసి వదినేపల్లి మహేష్‌(26), తలమంచిపట్నం - దొడియం మధ్య బైకు అదుపు తప్పి పప్పుబోయిన రామమోహన్‌ (36),  రైల్వేకోడూరు మామిడి కాయల యార్డు వద్ద బైకు ఢీకొనడంతో సాధు చిన్నయ్య(62) దుర్మరణం చెందగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కటకం గంగమ్మ(43) శనివారం మృతి చెందింది. వివరాల్లోకెళితే....

గోపవరం, ఏప్రిల్‌ 24: నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలో వెంకటమ్మపేట లో స్నేహితుడి వివాహానికి వెళతున్న వదినేపల్లి మహే ష్‌ ద్విచక్ర వాహనాన్ని వెంకటమ్మపేట సమీపంలో టా టా ఏస్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ద్విచక్ర వాహనం ముందు వెళుతున్న మరో కారును ఢీకొంది. దీంతో ద్వి చక్రవాహనంపై వెళుతున్న మహేష్‌ అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రగాయాల పాలయ్యాడు. కాల్వపల్లె లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. మహేష్‌ మృతిపట్ల సర్పంచ్‌ పసుపులేటి శ్రీనివాసులు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. 

బైకు అదుపు తప్పి....

మైలవరం, ఏప్రిల్‌ 24: ప్రొద్దుటూరు నుంచి రామమోహన్‌ ద్విచక్రవాహనంలో జమ్మలమడుగు నుంచి దొడియం మీదుగా బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి ముక్కబావిపల్లికి వెళ్తున్నాడు. ఇందులో భాగంగా తలమంచిప ట్నం - దొడియం మధ్య స్పీడ్‌బ్రైకర్‌ వద్ద బైకు అదుపు తప్పి కిందపడడంతో తలకు గాయమై రామమోహన్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు రామమోహన్‌కు భార్య, కూతురు ఉన్నారు. జరిగిన సంఘటనపై  మృతు ని తమ్ముడు బాలాజి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

బైకు ఢీకొనడంతో....

రైల్వేకోడూరు రూరల్‌, ఏప్రి ల్‌ 24: రైల్వేకోడూరు మండ లం మైసూరవారిపల్లె వాసి సాధు చిన్నయ్య మామిడి కాయల యార్డు వద్ద రోడ్డు దాటుతుండగా కోడూరు వైపు వెళ్తున్న బైకు ఢీకొంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్ధానికులు అతన్ని చికిత్స కోసం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రం గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తర లించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెంది నట్లు ఎస్‌ఐ హేమాద్రి తెలిపారు.  సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బైకులో ప్రయాణిస్తున్న వ్యక్తి  తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

చికిత్స పొందుతూ....

ఎర్రగుంట్ల, ఏప్రిల్‌ 24: ఈనెల 21న గురువారం గంగమ్మ ఆమె భర్త సంప త్‌కుమార్‌తో కలిసి ప్రొద్దు టూరుకు వెళ్లి తిరిగి వస్తుం డగా పోట్లదుర్తి వద్ద ప్రమా దం జరిగింది. ఇందులో తీ వ్రంగా గాయపడిన ఆమె ను చికిత్స నిమిత్తం ప్రొద్దు టూరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు. ఒకరు తొమ్మిదో తరగతి, మరొకరు బీటెక్‌ చదువుతున్నారు. ఎస్‌ఐ క్రిష్ణయ్య కేసు నమోదు చేశారు.Read more