నలుగురు క్రికెట్‌ బుకీలు అరెస్టు

ABN , First Publish Date - 2022-10-19T04:50:13+05:30 IST

కడప నగరం చలమారెడ్డిపల్లె రోడ్డులోని డంపింగ్‌ యార్డు వద్ద నలుగురు క్రికెట్‌ బుకీలను అరెస్టు చేసినట్లు చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

నలుగురు క్రికెట్‌ బుకీలు అరెస్టు

కడప (కైం), అక్టోబరు 18: కడప నగరం చలమారెడ్డిపల్లె రోడ్డులోని డంపింగ్‌ యార్డు వద్ద  నలుగురు క్రికెట్‌ బుకీలను అరెస్టు చేసినట్లు చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. సీఐ వివరాల మేరకు.. కడప నకా్‌సవీధికి చెందిన సయ్యద్‌ జాకీర్‌హుసేన్‌, కుమ్మరకుంటవీధికి చెందిన షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ ఆరిఫ్‌, మాసాపేటకు చెందిన షేక్‌ ముబారక్‌లు డంపింగ్‌ యా ర్డు వద్ద క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారన్న సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి వారిని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.90వేలు నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. 

Read more