డ్రైనేజీ పనుల్లో నాణ్యత గాలికి

ABN , First Publish Date - 2022-07-19T05:02:29+05:30 IST

డ్రైనేజీ పనుల్లో నాణ్యతను కాంట్రాక్టర్లు గాలికొదిలేశారని ముస్లిం మైనార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు ఖాదర్‌బాషా ధ్వజమెత్తారు.

డ్రైనేజీ పనుల్లో నాణ్యత గాలికి
దెబ్బతిన్న డ్రైనేజీ కాలువను చూపిస్తున్న టీడీపీ నాయకులు

కమలాపురం రూరల్‌, జూలై 18 : డ్రైనేజీ పనుల్లో నాణ్యతను కాంట్రాక్టర్లు గాలికొదిలేశారని ముస్లిం మైనార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు ఖాదర్‌బాషా ధ్వజమెత్తారు. సోమవారం ఆయన టీడీపీ నాయకులతో కలిసి 13వ వార్డు బీడీ కాలనీలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణం నాసిరకంగా చేపట్టారని, అందుకు తెలుగు ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్న కాలువే అందుకు నిదర్శనమన్నారు. రూ.36 కోట్లతో నిర్మించిన డ్రైనేజీ నాసిరకం పనుల వల్ల దెబ్బతింటోందన్నారు. కాంట్రాక్టర్లు నాసిరకంగా  చేసిన పనులు వల్ల డ్రైనేజీ కాలువపై భాగం అప్పుడే కూలిపోయిందని, ఈ ప్రాంతంలో బడి పిల్లలు ఆడుకుంటూ కాలువులో పడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని చుట్టుపక్కల ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. నాసిరకం పనులపై ఎమ్మెల్యే విచారణ జరిపి పనులు చేసిన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే కాలువ మరమ్మతు పనులు చేయించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్‌ మహమ్మద్‌ రఫి, 12వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ బాబూల్‌, 19వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ అజ్మతుల్లా, కడప పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి, దాది రామయ్య, దివాకర్‌రెడ్డి, జంపాల నరసింహారెడ్డి పాల్గొన్నారు. 

Read more