రైతులను ఒప్పించి నీటి తీరువా పన్ను వసూలు చేయాలి

ABN , First Publish Date - 2022-05-31T05:26:32+05:30 IST

మండలంలో కేసీ కెనాల్‌ ఆయకట్టు కింద భూములున్న రైతులను ఒప్పించి నీటి తీరువా పన్నును వసూలు చేయాలని తహసీల్దార్‌ అలీఖాన అన్నారు.

రైతులను ఒప్పించి నీటి తీరువా పన్ను వసూలు చేయాలి

చెన్నూరు, మే 30: మండలంలో కేసీ కెనాల్‌ ఆయకట్టు కింద భూములున్న రైతులను ఒప్పించి నీటి తీరువా పన్నును వసూలు చేయాలని తహసీల్దార్‌ అలీఖాన అన్నారు. సోమవారం రెవెన్యూ కా ర్యాలయంలో తహసీల్దార్‌ సిబ్బందితో సమావేశం ని ర్వహించి మాట్లాడారు. మండలంలో రూ.61 లక్షలకు పైగా నీటి తీరువా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.9.66 లక్షలు మాత్రమే వసూలైందన్నారు. అలాగే మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సర్వే స్టోన్స నాటించాలని వీఆర్వోలకు సూచించారు. లేఔట్లు వేసి ల్యాండ్‌ కన్వర్షన చేసుకొని ఆ వివరాలు తనకు అందించాలన్నారు. ఒకవేళ కన్వర్షన చేసుకోకుండా స్థలాలను ప్లాట్ల పరంగా అమ్ముకోవాలనుకుంటే నిలిపేయాలని ఆయన సూచించారు. మండలంలో ఎవరైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించినా, ఇంటి స్థలాలను స్వాధీనం చేసుకోవాలనుకున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఇచ్చిన స్థలాల్లో పక్కా గృహాలు నిర్మించుకునేలా లబ్ధిదారులతో, బ్యాంకర్లతో, డ్వాక్రా సిబ్బందితో మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో డీటీ రాజే్‌షకృష్ణ, ఆర్‌ఐలు వేణుగోపాల్‌, సౌజన్య, వీఆర్వోలు, వీర్‌ఏలు పాల్గొన్నారు. 

Read more