-
-
Home » Andhra Pradesh » Kadapa » Farmers should be made aware-MRGS-AndhraPradesh
-
రైతులకు అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2022-08-18T05:18:56+05:30 IST
వ్యవసాయ రంగంలో విప్లవాత్మకంగా అమలు చేస్తున్న బిందు, తుంపర సేద్య పరికరాలపైౖ రైతులకు అవగాహన కల్పించాలని ప్రాజెక్టు మేనేజర్ హరినాధ్‌రెడ్డి తెలిపారు.

కడప(రూరల్), ఆగష్టు 17: వ్యవసాయ రంగంలో విప్లవాత్మకంగా అమలు చేస్తున్న బిందు, తుంపర సేద్య పరికరాలపైౖ రైతులకు అవగాహన కల్పించాలని ప్రాజెక్టు మేనేజర్ హరినాధ్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లోని సభాభవనంలో ఉద్యానశాఖ అధికారులు, రాష్ట్ర, జిల్లా కంపెనీ ప్రతినిధులకు, ఎంఐ ఇంజనీర్లు, ఎంఐడీసీలు, ఎంఐఏఓలతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ రైతులు సూక్ష్మ సేద్య పరికరాల కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 9450 హెక్టార్లలో బిందు సేద్యం, 3150 హెక్టార్లలో తుంపర సేద్యం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యా న్ని నిర్దేశించిందన్నారు. ఆర్‌బీకేల ద్వారానే రిజిస్ట్రేషన్స్ మొదలుకొని రైతులకు పరికరాలు అందించే వరకు వారే పూర్తి చేయాలన్నారు. కంపెనీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేసి నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఏపీఎంఐపీ పీడీ రవీంద్రనాధ్ రెడ్డి, అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ మురళీ మోహన్‌రెడ్డి, ఏపీఎంఐపీ, ఎంఐ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.