విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-03-06T04:33:04+05:30 IST

మండలంలోని గొల్లలగూడూరులో కల్లూరు నాగభూషణ్‌రెడ్డి (50) అనే రైతు పొలంలో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
నాగభూషణ్‌రెడ్డి మృతదేహం

వేముల, మార్చి 5: మండలంలోని గొల్లలగూడూరులో కల్లూరు నాగభూషణ్‌రెడ్డి (50) అనే రైతు పొలంలో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం తోటలో నీరు కట్టేందుకు వెళ్లిన రైతు మోటార్‌ ఆన్‌ చేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పులివెందులలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Read more