-
-
Home » Andhra Pradesh » Kadapa » Falling tent results are a government conspiracy-MRGS-AndhraPradesh
-
టెన్త్ ఫలితాలు పడిపోవడం ప్రభుత్వ కుట్రే
ABN , First Publish Date - 2022-06-08T05:11:19+05:30 IST
పదో తరగతి పలితాలు బాగా తగ్గి పోవడంలో అమ్మఒడి, సంక్షేమ పథ కాలకు విద్యార్థులను తగ్గించేం దుకు ప్రభుత్వ కుట్ర దాగి ఉం దని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ క కార్యదర్శి పర్వీన్‌తాజ్ ఆరోపించారు.

బి.కొత్తకోట జూన్ 7 : పదో తరగతి పలితాలు బాగా తగ్గి పోవడంలో అమ్మఒడి, సంక్షేమ పథ కాలకు విద్యార్థులను తగ్గించేం దుకు ప్రభుత్వ కుట్ర దాగి ఉం దని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ క కార్యదర్శి పర్వీన్‌తాజ్ ఆరోపించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ విడుదలైన టెన్త్ పరీక్ష పలితాల్లో విద్యార్థులు పెయిల్ కాలేదని, జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రస్టు పట్టించి పరీక్షల నిర్వహణలో పెయిల్ అయిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో 71 స్కూళ్ళలో ఒక్కరూ ఉత్తీర్ణులు కాకపోవడం 20 ఏళ్లలో అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం దారుణమన్నారు. అమ్మఒడి ఇవ్వడానికి నిధులు లేక అప్పులు దొరక్క ఇప్పటికే వాయిదాలు వేసుకుం టూ వచ్చిన ప్రభుత్వం లబ్దిదారులను తగ్గించే కుట్రలో భాగంగానే అత్యధికు ల్ని పెయిల్ చేసిందనే అనుమానాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కిట్టన్న, రవికుమార్, ప్రభాకర, మధార్‌సాబ్, నాగరాజు పాల్గొన్నారు.