నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-09-28T04:02:19+05:30 IST

సచివాలయ సిబ్బంది విఽధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా హెచ్చరించారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
పక్కాగృహాల నిర్మాణాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీషా

సచివాలయ సిబ్బంది మెరుగైన సేవలందించాలి

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా


ములకలచెరువు, సెప్టెంబరు 27: సచివాలయ సిబ్బంది విఽధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా హెచ్చరించారు. మండలంలోని పెద్దపాళ్యం, పాత ములకలచెరువు సచివాలయాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే పాత ములకలచెరువు వద్ద జరుగుతున్న పక్కాగృహాల నిర్మాణాలను పరిశీలించారు. ములకలచెరువు ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రజలరు మెరుగైన సేవలందించాలని, వివిధ సమస్యలపై సచివాలయాలకు వచ్చే ప్రజలను తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పెండింగ్‌ లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణకు సచివాలయ ఏఎన్‌ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సచివాలయ పరిధిలో ఎంతమంది గర్భిణులు ఉన్నారు, రక్తహీనతతో ఎంత మంది బాధపడుతున్నారని ఏఎన్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు. వారు పౌష్టికాహారం, ఐరన్‌ ట్యాబ్లెట్లు తీసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. దేవళచెరువు హెల్త్‌ సబ్‌సెంటర్‌ భవనం దుస్థితికి చేరిందని పలువురు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణం స్పందించిన కలెక్టర్‌ దేవళచెరువు హెల్త్‌ సబ్‌ సెంటర్‌ నూతన భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మరమ్మతులకు గురైన హెల్త్‌ సబ్‌సెంటర్లు ఎన్ని ఉన్నాయో నివేదిక ఇవ్వాలని తెలిపారు. సచివాలయాల్లో సిబ్బంది హాజరు పట్టిక, మూమెంట్‌ రిజిస్టర్‌ తదితర రికార్డులను పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో రమే్‌షబాబు, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంఈవో వెంటకరమణ, పీఆర్‌ ఏఈ అనిత, ఏపీవో రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read more