-
-
Home » Andhra Pradesh » Kadapa » Except for changing the names there is no development of the state-MRGS-AndhraPradesh
-
పేర్లు మార్చడం తప్ప.. రాష్ట్రాభివృద్ధి శూన్యం!
ABN , First Publish Date - 2022-10-02T05:17:19+05:30 IST
సంక్షేమ పథకాలకు పేర్లు మార్చడం తప్ప జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమేష్ నాయుడు విమర్శించారు.

రాజంపేట, అక్టోబరు1 : సంక్షేమ పథకాలకు పేర్లు మార్చడం తప్ప జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమేష్ నాయుడు విమర్శించారు. శనివారం రాజంపేట పాతబస్టాండు కూడలిలో నిర్వహించిన ప్రజా పోరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్, విద్య, వైద్య, రోడ్లు, ఉచిత బియ్యం తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలగా చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. రాజధాని పేరుతో ప్రజల మధ్య గొడవలు, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తూ అమరావతి రైతులను అడుగడుగునా అవమానిస్తున్నారన్నారు. రాబోవు ఎన్నికల్లో జగన్ డిపాజిట్ కోల్పోవడం తఽథ్యమని జోస్యం చెప్పారు..
వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి
ఒంటిమిట్ట : వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక కోదండ రామాల యం వెనుక భాగంలో వారు ప్రచారం నిర్వహించారు. ప్రజా వ్యతి రేక విధానాల కారణంగా వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యునికి అందకుండా పోయాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్య క్షుడు బాలరాజ్ శివరాజు, సుబ్బరామయ్య, బీజేపీ నాయ కులు ఆటో కార్మికులు పాల్గొన్నారు.