ప్రతి కుటుంబానికి వైద్య సేవలు అందాలి

ABN , First Publish Date - 2022-12-12T23:49:25+05:30 IST

ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ విధానంలో ప్రతి కుటుంబానికి వైద్యసేవలు అందేలా క్షేత్రస్థాయి సిబ్బంది, ఆశాకార్యకర్తలు కృషిచేయాలని బద్వేల్‌ డివిజన్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రహాసరెడ్డి పేర్కొన్నారు.

ప్రతి కుటుంబానికి వైద్య సేవలు అందాలి

కాశినాయన డిసెంబరు12: ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ విధానంలో ప్రతి కుటుంబానికి వైద్యసేవలు అందేలా క్షేత్రస్థాయి సిబ్బంది, ఆశాకార్యకర్తలు కృషిచేయాలని బద్వేల్‌ డివిజన్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రహాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రంపాడు పంచాయతీలోని ఓబుళాపురం గ్రామ సచివాలయ కేంద్రంలో నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ కార్యక్రమాన్ని ఆయన ఆకస్శికంగా తనిఖీచేశారు. అనంతరం 104 సిబ్బందితో కలిసి పలువురు బెడెడ్‌ రోగులను,అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి వారికి పలుచూచనలు సలహాలు అందజేశారు. ఈకార్యక్రమంలో సూపర్‌వైజర్‌ బాలయ్య,అబ్జర్వర్‌ చంద్రశేఖర్‌,సచివాలయ ఏఎన్‌ఎంలు వెంకటరమణమ్మ, బీబీ, ఆశాకార్యకర్త రాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:49:41+05:30 IST

Read more