సీపీఐ నూతన కమిటీల ఎన్నిక

ABN , First Publish Date - 2022-08-02T05:11:37+05:30 IST

తంబళ్లపల్లె నియోజకవర్గపు సీపీఐ 5వ మహా సభలలో సీపీఐ నియోజకవర్గ, మండల నూతన కమిటీలను సోమవారం ఎన్నుకు న్నారు.

సీపీఐ  నూతన కమిటీల ఎన్నిక

బికొత్తకోట ఆగస్టు 1 : తంబళ్లపల్లె నియోజకవర్గపు సీపీఐ 5వ మహా సభలలో సీపీఐ నియోజకవర్గ, మండల నూతన కమిటీలను సోమవారం ఎన్నుకు న్నారు. సీపీఐ ప్రతినిధుల సభలో నియోజక వర్గం లో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై పలు తీర్మా నా లు ఆమోదించారు.ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు, జిల్లా కార్యవర్గ సభ్యుడు టి.కృష్ణప్పలు హాజర య్యారు. కాగా నూతన కమిటీలో తంబళ్ళపల్లె నియోజకవర్గ కార్యదర్శిగా  నాల్గవ సారి  మనోహ ర్‌రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎస్‌ బషీర్‌ఖాన్‌, బి.వేణుగోపాల్‌రెడ్డి, కె. అంజనప్ప (మొలకలచెర్వు), ఎస్‌. సలీంబాష, పి.జవహార్‌బాబు, పి.శంకర, (పీటీ ఎం), రామాంజులు (పెద్దమండ్యం), శివమ్మ, ఆసియా, ఆనంద(మొలకలచెర్వు), అష్ర ఫ్‌అలీ, షమీవుల్లా, గంగులప్ప, తంబయ్యశెట్టిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.   నియో జక వర్గంలో టమోట ఆధారిత పరిశ్రమను ప్రభుత్వం నెల కొల్పాలని, బి.కొత్తకోటలో ఉర్దూ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు.


Read more