విద్యారంగ సంస్కర్త మౌలానా అబుల్‌ కలాం అజాద్‌

ABN , First Publish Date - 2022-11-11T22:57:28+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ గొప్ప సంస్కర్త అని ప్రిన్సిపాల్‌ బాలకృష ్ణమూర్తి అ న్నారు.

విద్యారంగ సంస్కర్త  మౌలానా అబుల్‌ కలాం అజాద్‌
మౌలానా అబుల్‌కలాం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌నాయకులు

మదనపల్లె టౌన, నవంబరు 11: స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ గొప్ప సంస్కర్త అని ప్రిన్సిపాల్‌ బాలకృష ్ణమూర్తి అ న్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో మౌలానా 135వ జ యంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఎనఎస్‌ఎస్‌ అధి కారి సేగు రెడ్డెప్పరెడ్డి, శివపార్వతిదేవి, అధ్యాపకులు గంగ య్య, రమణ, మాలతి పాల్గొన్నారు. బీటీ ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రిన్సి పాల్‌ గిరిబాబు, వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకట శివా రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

మదనపల్లె రూరల్‌: పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు క లాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళు లర్పించారు. షంషీర్‌, నాగూర్‌ వలీ, రెడ్డిసాహె బ్‌, నజీర్‌, జబీవుల్లా పాల్గొన్నారు.

రామసముద్రం: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో ప్రిన్సిపాల్‌ మురళీధర్‌ కలాం సేవలను కొనియాడారు.విద్యావిఽధానంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఎనఎస్‌ఎస్‌ అధికారి సత్యనారా యణ స్వామి, అధ్యాపకులు నాగరాజ, రవీంద్ర భవాని, శ్రీలత, లక్ష్మీ, పాల్గొన్నారు.

బి.కొత్తకోట: మదురై మీనాక్షి డిగ్రీ కళాశాలలో నివాళులర్పించారు. ప్రిన్సపాల్‌ టి.రామ్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సపాల్‌ రమేశబాబు, ఎన.ఎస్‌.ఎస్‌ ప్రో గ్రామ్‌ ఆఫీసర్‌ సి.నరేంద్ర, అధ్యాపకులు, విద్యా ర్థులు, యాజమాన్యం సభ్యులు పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రం:ఆదర్శ పాఠశాలలో నివాళు లర్పించారు. ఎంఈవో నారాయణ, ప్రిన్సిపాల్‌ శివకుమారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T22:57:38+05:30 IST

Read more