కొండలు గుట్టలతోనే పర్యావరణ సమతుల్యత

ABN , First Publish Date - 2022-08-18T04:19:38+05:30 IST

కొండలు, గుట్టలు, వంకలు, వాగులూ యథా తథంగా కొనసాగితేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని ఎంపీడీవో గంగయ్య తెలిపారు.

కొండలు గుట్టలతోనే పర్యావరణ సమతుల్యత
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో గంగయ్య

కలికిరి, ఆగస్టు 17:  కొండలు, గుట్టలు, వంకలు, వాగులూ యథా తథంగా కొనసాగితేనే పర్యావరణ సమతుల్యత  సాధ్యమని ఎంపీడీవో గంగయ్య తెలిపారు. సహజ వనరులకు ఏమాత్రం భంగం కలిగినా దుష్పరిణామాలు ఎదురవుతాయన్నారు. మండల పరిషత్తు కార్యాల యంలో ఫౌండేషన్‌ ఫర్‌ ఎకలాజికల్‌ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో సహజ వనరుల సంరక్షణ సంఘాల అధ్యక్షుల సమావేశం లో ఆయన మాట్లాడారు. భూమి వైశాల్యంలో కనీసం 33 శాతం అడవులు, కొండ లు, గుట్టలు, వంకలు, వాగులు ఉండాలని వివరించారు. వీటిని సంరక్షించుకోవలసిన బాధ్యత, అవసరం ఎంతో ఉందన్నారు. సంస్థ జిల్లా ఇన్‌చార్జి రాణిరెడ్డి మాట్లాడుతూ సహజ వనరులను సంరక్షిం చడం కోసం గ్రామాల్లో సహజ వనరుల సంరక్షణ సంఘా లను ఏర్పాటు చేశామన్నారు. సహజ వనరుల వివరాలను రెవెన్యూ రికార్డు ల్లో భద్రపరిచేందుకు ఆయా సంఘాల అధ్యక్షులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఈవోపీఆర్డీ అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌,  మండ ల ఇన్‌చార్జి హసీనా పాల్గొన్నారు. 


Read more