వేడుకగా దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-27T05:00:33+05:30 IST

పట్టణంలో పలు ఆలయాల్లో దసరా శరన్ననవరాత్రి ఉత్సవాలు సోమ వారం నుంచి వేడుకగా వైభవంగా ప్రారంభమయ్యా యి.

వేడుకగా దసరా ఉత్సవాలు
మదనపల్లెలో అలంకరణలో అమ్మవారు

మదనపల్లె అర్బన్‌, సెప్టెంబరు 26: పట్టణంలో పలు ఆలయాల్లో దసరా శరన్ననవరాత్రి  ఉత్సవాలు సోమ వారం నుంచి వేడుకగా  వైభవంగా ప్రారంభమయ్యా యి. ఆలయాల్లో ఉదయం పంచామృతాభిషేకం, అర్చ నలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ఆలయాలు జనంతో కిక్కిరిసిపోయాయి. అనంతరం భక్తులకు ఆలయకమి టీ సభ్యులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సావాల్లో భాగంగా నీరుగుట్టువా రిప ల్లెలో తొగటవీరక్షత్రియుల ఆరాధ్య దైవం చౌడేశ్వరీ దేవిని ఆలయ కమిటీ అధ్య క్షుడు ఉప్పు రామచంద్ర, సెక్రటరీ గుండ్లపల్లె ప్రభాకర్‌, ట్రెజరర్‌ రామిశెట్టి లోకేష్‌ ఆధ్వర్యంలో సాయంత్రం పసుపు అలంకరణ తో ప్రత్యే కంగా అలంకరించారు. అంతకముందే వారి కులగురువు జ్థానానంద స్వామిజీని ఆలయకమిటీ సభ్యులు, తొగటక్షత్రియ సంఘం రాష్ట్రప్రధాన కార్యద ర్శి కృష్ణమూర్తి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు భోజ నపు వెంకటనారాయణ, గౌరవాధ్యక్షుడు మోడెం వెంక టరమణ, మోడెం సిద్దప్ప, రామిశెట్టి వెంకటరమణ, గుండ్లపల్లె లక్ష్మీనారాయణ, కోన నాగరాజ, మున్సిపల్‌ కౌన్సిలర్‌ శివయ్యలు కలిసి దుశ్శాలువతో ఘనం గా సన్మానించారు. పట్టణంలో వాసవీభవన్‌ వీధిలోని వాసవీ కన్య కాపరమేశ్వరీదేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్పవాలను వైభవంగా ప్రారంభించారు.  కార్యక్రమంలో మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్‌, ట్రె.రర్‌ సూరేగిరిధర్‌,  పాల్గొన్నారు. పట్టణంలోని కోర్టు ఆవర ణలో ఉన్న గంగమ్మ ఆలయాన్ని దసరా శరన్నవరాత్రి పురస్కరించుకుని శోభాయుమానంగా అలంకరించా రు.  మహిళలు పొం గళ్లు నైవేధ్యంతో ఆల యానికి తరలి వచ్చి సమర్పించారు.  సీటీఎం రోడ్డు దేవతా నగర్‌లోని రాజరాజేశ్వరీదేవి వైభవంగా పూజ లు నిర్వహించారు. పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తు లు ఆలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. 

స్వర్ణ కవచాలంకృత 

అలంకారంలో రెడ్డెమ్మతల్లి

గుర్రంకొండ, సెప్టెంబరు 26:గుర్రంకొండ మండలం చెర్లోపల్లె రెడ్డెమ్మ కొండ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చా రు. ఇందులో భాగంగా  ఉదయం  కలశ స్థాపన, గణపతి పూజ, అర్చనలను చేశారు. అనంతరం అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. కార్యక్రమంలో చైర్మన్‌ నరసింహారెడ్డి, ఈవో మంజుల, అర్చకులు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండలం వ్యాప్తంగా దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమ య్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మండ లంలోని చింతపర్తి వాసవీ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి అలంకరణ, వాల్మీకిపురం కోనేటివీధిలోని కామే శ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి బాలాత్రిపుర సుందరి  దేవిగాను, కన్యకాపర మేశ్వరి అలంకరణ, నల్లవీరంగాభవాని ఆలయంలో ఆదిపరాశక్తి అలంక రణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవా లలో తొలిరోజు ఆలయా లు భక్తులతో కిటకిటలా డాయి. ఈ సందర్భంగా ఆలయాల చెంత భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదానాలు చేపట్టారు. కార్యక్రమాల లో నిర్వాహకులు కాంతరాజు, కువైట్‌ శంకరాచారి, సతీష్‌, అర్చకులు  పాల్గొన్నారు. 

ములకలచెరువులో: ములకలచెరువులోని పీటీఎం రోడ్డులో వెలసిన  వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి అమ్మ వారి నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారం భమయ్యాయి. తొలి రొజు అమ్మవారికి పసుపుతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషే కం, ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. 

కలికిరిలో: మండలంలోని పలు చోట్ల శరన్నవరాత్రు ల ప్రారంభం సందర్భంగా సోమవారం అమ్మవారి ఆలయాలు  ముస్తాబయ్యాయి. రెండేళ్ళుగా శరన్నవ రాత్రుల ఉత్సవాలు నామమాత్రంగా జరిగిన నేప థ్యంలో ఈ దఫా ఘనంగా వేడుకలకు సిద్దమయ్యా యి.  కలికిరి గ్రామ దేవత యల్లమ్మ ఆలయ నిర్వాహ కులు అశోక్‌రెడ్డి, మధుసూదనరెడ్డి భక్తులకు అవసర మైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా దేవీ నవరాత్రు ల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం బాల త్రిపురసుందరీ దేవి, బుధవారం గాయత్రీ దేవి, గురువారం అన్నపూర్ణ దేవి, శుక్రవారం మహాలక్ష్మి, శనివారం సరస్వతీ దేవి, ఆదివారం దుర్గా దేవి, సోమ వారం మహిషాసుర మర్ధనీ దేవి, చివరగా తొమ్మిదవ రోజు మంగళవారం రాజరాజేశ్వరీ దేవి అవతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. పట్టణంలోని కన్యకాపర మేశ్వ రి ఆలయంలో అమ్మవారు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక ప్రసన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో మొదటిసారిగా శరన్నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాటు చేశారు. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు పార్వతీదేవి సర్వాలంకృత శోభితురాలై భక్తులకు కనువిందు చేసింది. 

బి.కొత్తకోటలో: బి.కొత్తకోటలో దసరా నవరాత్రి ఉత్స వాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని పసుపు, కుంకుమతో విశేషంగా అలంకరించి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.  కార్యక్ర మంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు, మహి ళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీసీ కాలనీలోని వెంక టరమణ స్వామి ఆలయంలో గరుడ వాహన ఉత్స వం నిర్వహించారు. కార్యక్రమంలో మేడా వెంకటేష్‌ రాజు కుటుంబ సభ్యు లు పాల్గొన్నారు. సాయిబాబా ఆలయంలో  ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 

కలకడలో: మండలంలోని కోనలో వెలసిన చౌడేశ్వరి దేవి ఆలయంలో సోమవారం నుంచి దేవి నవరాత్రి ఊత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. 

పీలేరులో: దసరా ఉత్సవాల్లో తొలిరోజైన సోమవారం పీలేరులోని  కన్యకాపరమేశ్వరి అమ్మవారు వాసవీ అలంకారంలోనూ, రౌద్రాల అంకాళమ్మ గాయత్రీదేవీ గా, దిన్నెగంగమ్మ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చా రు. పీలేరులోని అమ్మవారి ఆలయాల్లో సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం సాయంత్రం వాసవీ మహిళా క్లబ్‌ సభ్యురాళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

రామసముద్రంలో: మండలంలో  దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రామసముద్రంలోని దుర్గమ్మ ఆలయం, వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం, లక్ష్మీజ నార్ధన ఆలయం, తిరుమలరెడ్డిపల్లెలోని మారెమ్మ ఆల యం, చౌడేశ్వరి ఆలయం, మునీశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక అలంకరణ చేశారు. 

Read more